Telugu Global
Cinema & Entertainment

శర్వా లుక్ బయటపడింది

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఒకటి రెగ్యులర్ గానే ఉంటుంది. రెండోది మాత్రం 40ఏళ్ల వయసున్న మాజీ మాఫియా డాన్ పాత్ర. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ లుక్ తోనే ఫస్ట్ లుక్ విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ఆ స్టిల్స్ లీక్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి స్పెయిన్ లో ఓ సాంగ్ […]

శర్వా లుక్ బయటపడింది
X

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఒకటి రెగ్యులర్ గానే ఉంటుంది. రెండోది మాత్రం 40ఏళ్ల వయసున్న మాజీ మాఫియా డాన్ పాత్ర. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ లుక్ తోనే ఫస్ట్ లుక్ విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ఆ స్టిల్స్ లీక్ అయ్యాయి.

ఈ సినిమాకు సంబంధించి స్పెయిన్ లో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. దాదాపు 200 మంది డాన్సర్స్ తో భారీ ఎత్తున ఆ సాంగ్ తీస్తున్నారు. ఇందులో 40 ఏళ్ల డాన్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తున్నాడు. దట్టంగా గడ్డం కూడా పెంచాడు. ఆ స్టిల్స్ కాస్తా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

కీలకమైన గెటప్ కు సంబంధించిన స్టిల్స్ లీక్ అవ్వడంతో యూనిట్ ఇప్పుడు తలపట్టుకుంది. ఫస్ట్ లుక్ కోసం మరో కొత్త ప్లాన్ వేస్తోంది.

కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  20 Feb 2019 3:50 AM GMT
Next Story