Telugu Global
NEWS

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.... ఒటాన్ అకౌంట్‌కు ఆమోదం

తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన తొలి సారిగా రేపు (గురువారం) కేబినెట్ సమావేశం జరుగనుంది. కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు త్వరలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉండటంతో సీఎం కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. త్వరలో ప్రవేశపెట్టే ఒటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు పలు ఇతర అంశాలపై […]

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.... ఒటాన్ అకౌంట్‌కు ఆమోదం
X

తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన తొలి సారిగా రేపు (గురువారం) కేబినెట్ సమావేశం జరుగనుంది. కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు త్వరలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉండటంతో సీఎం కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. త్వరలో ప్రవేశపెట్టే ఒటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు పలు ఇతర అంశాలపై కూడా మంత్రి వర్గం చర్చించనుంది.

ఇది తొలి సమావేశం కావడంతో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశా నిర్థేశం చేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులకు వివరించనున్నట్లు సమాచారం.

First Published:  19 Feb 2019 8:16 PM GMT
Next Story