Telugu Global
NEWS

అతిపెద్ద ప్రయాణీకుల విమానం నడిపిన ఆస్ట్రేలియా క్రికెటర్

పైలట్ కమ్ క్రికెటర్ ఉస్మాన్ క్వాజా టీమిండియాతో తలపడే కంగారూ జట్టులో క్వాజా ఆస్ట్రేలియా టాపార్డర్ ఆటగాడు ఉస్మాన్ క్వాజా ప్రతిభావంతుడైన క్రికెటర్ మాత్రమే కాదు… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల విమానం ఎయిర్ బస్ ఏ-380ని అలవోకగా నడపగల పైలట్ కూడా. టీమిండియాతో ఆదివారం ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టీ-20, ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ల్లో పాల్గొనే కంగారూ జట్టులో సైతం ఉస్మాన్ క్వాజా కీలకసభ్యుడిగా ఉన్నాడు.  కంగారు క్రికెటర్ల స్టయిలే వేరు… క్రికెట్టే […]

అతిపెద్ద ప్రయాణీకుల విమానం నడిపిన ఆస్ట్రేలియా క్రికెటర్
X
  • పైలట్ కమ్ క్రికెటర్ ఉస్మాన్ క్వాజా
  • టీమిండియాతో తలపడే కంగారూ జట్టులో క్వాజా

ఆస్ట్రేలియా టాపార్డర్ ఆటగాడు ఉస్మాన్ క్వాజా ప్రతిభావంతుడైన క్రికెటర్ మాత్రమే కాదు… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల విమానం ఎయిర్ బస్ ఏ-380ని అలవోకగా నడపగల పైలట్ కూడా.

టీమిండియాతో ఆదివారం ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టీ-20, ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ల్లో పాల్గొనే కంగారూ జట్టులో సైతం ఉస్మాన్ క్వాజా కీలకసభ్యుడిగా ఉన్నాడు.

కంగారు క్రికెటర్ల స్టయిలే వేరు…

క్రికెట్టే ప్రధాన వృత్తిగా భావించే క్రికెటర్లే మనదేశంలో ఎక్కువ. అయితే …ఆస్ట్రేలియా క్రికెట్లో మాత్రం…అక్కడి క్రికెటర్ల వృత్తి, ప్రవృత్తి వేర్వేరుగా ఉంటాయి. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిషెల్ జాన్సన్ క్రికెటర్ కావటానికి ముందే..భారీ ట్రక్కులు నడిపే డ్రైవర్ .

2015 సీజన్లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత…మిషెల్ తన వృత్తిని తిరిగి కొనసాగిస్తున్నాడు. భారీ ట్రక్కులు నడుపుతూ తన జీవన యానాన్ని సాగిస్తున్నాడు.

అయితే…ఆస్ట్రేలియా టాపార్డర్ ఆటగాడు ఉస్మాన్ క్వాజా మాత్రం మనకు క్రికెటర్ గా మాత్రమే తెలుసు. అయితే…అతనిలో ఓ ప్రొఫెషనల్ పైలట్ దాగి ఉన్న విషయం ఈమధ్యనే వెలుగులోకి వచ్చింది.

సౌదీ టు ఆస్ట్రేలియా….

ఉస్మాన్ క్వాజా..,తన తండ్రి ఉద్యోగరీత్యా బాల్యాన్ని సౌదీ అరేబియాలో గడిపిన సమయంలో….వివిధ దేశాల మధ్య నడిచే విమానాలంటే మక్కువ పెంచుకొన్నాడు. క్రికెట్ అంటే ఇష్టంగా ఉన్నా ప్రొఫెషనల్ పైలట్ కావాలని నిర్ణయించుకొన్నాడు.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో…న్యూసౌత్ వేల్స్ లోని ఏవియేషన్ యూనివర్శిటీలో…పైలట్ కోర్సులో ప్రవేశం సంపాదించి… కఠోరశిక్షణతో పైలట్ గా అర్హత సంపాదించాడు. పైలట్ గా లైసెన్స్ వచ్చిన తర్వాత క్రికెట్ పైనే దృష్టి పెట్టి…ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించాడు.

క్రికెటర్ గా ఉస్మాన్ క్వాజా…

2011 సీజన్లో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు సంపాదించిన 32 ఏళ్ల ఉస్మాన్ క్వాజాకు 41 టెస్టుల్లో 8సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో సహా 2వేల 765 పరుగులు, 21 వన్డేలు, 9 టీ-20 మ్యాచ్ లు ఆడిన అనుభవం, రికార్డులు ఉన్నాయి.

ఇటీవలే టీమిండియాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో క్వాజా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్ లో 198 పరుగులతో 28. 29 సగటు మాత్రమే సాధించాడు. అయితే …తీన్మార్ వన్డే సిరీస్ లో మాత్రం 114 పరుగులతో 38 సగటు నమోదు చేశాడు.

పైలట్ గా క్వాజా…

సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ వచ్చిన క్వాజా…క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకొని…పైలట్ గా తానేమిటో పరీక్షించుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఇటీవలే ఓ ఎయిర్ బస్ ఏ-380ని విజయవంతంగా నడిపి.. తన ప్రావీణ్యాన్ని పరీక్షించుకొన్నాడు. ల్యాండింగ్ సమయంలో కాస్త తడబడినా సమర్ధుడైన పైలట్ గా నిరూపించుకొన్నాడు.

క్రికెట్ ఆటకు, పైలట్ శిక్షణకు ఎంతో సామీప్యత ఉందని…రెండింటికి ఏకాగ్రత, అంకితభావం, క్రమశిక్షణ తప్పనిసరని తనకు తెలిసివచ్చిందని క్వాజా తరచూ గుర్తు చేసుకొంటూ ఉంటాడు.

మరి టీమిండియాతో..24 నుంచి జరిగే రెండుమ్యాచ్ ల టీ-20, ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఈ పైలట్ కమ్ క్రికెటర్ ఏ రేంజ్ లో రాణించగలడన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  20 Feb 2019 5:54 AM GMT
Next Story