Telugu Global
Cinema & Entertainment

ఈసారి టైటిల్ కూడా మార్చేశారుగా!

అర్జున్ రెడ్డి రీమేక్ గా తమిళనాట తెరకెక్కుతున్న వర్మ సినిమాకు సంబంధించి రోజుకో మార్పు చోటుచేసుకుంటోంది. ఇప్పటికే దర్శకుడ్ని, హీరోయిన్ ను, సినిమాటోగ్రాఫర్ ను మార్చేసిన యూనిట్.. ఈసారి ఏకంగా సినిమా టైటిల్ ను కూడా మార్చేసింది. అవును.. ఈ సినిమా టైటిల్ ఇప్పుడు వర్మ కాదు. ఆదిత్య వర్మ. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా టైటిల్ ను ఎలా డిజైన్ చేశారో ఇప్పటికీ అందరికీ గుర్తే. అదే డిజైన్ ను యథాతథంగా బాలీవుడ్ రీమేక్ […]

ఈసారి టైటిల్ కూడా మార్చేశారుగా!
X

అర్జున్ రెడ్డి రీమేక్ గా తమిళనాట తెరకెక్కుతున్న వర్మ సినిమాకు సంబంధించి రోజుకో మార్పు చోటుచేసుకుంటోంది. ఇప్పటికే దర్శకుడ్ని, హీరోయిన్ ను, సినిమాటోగ్రాఫర్ ను మార్చేసిన యూనిట్.. ఈసారి ఏకంగా సినిమా టైటిల్ ను కూడా మార్చేసింది. అవును.. ఈ సినిమా టైటిల్ ఇప్పుడు వర్మ కాదు. ఆదిత్య వర్మ.

తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా టైటిల్ ను ఎలా డిజైన్ చేశారో ఇప్పటికీ అందరికీ గుర్తే. అదే డిజైన్ ను యథాతథంగా బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ లో కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు కోలీవుడ్ రీమేక్ కోసం కూడా అదే సెంటిమెంట్ ను పాటిస్తున్నారు. టైటిల్ డిజైన్ లో ఏమాత్రం మార్పు ఉండకూడదనే ఉద్దేశంతో ఆదిత్య వర్మ అనే టైటిల్ ను కూడా అర్జున్ రెడ్డి టైటిల్ మాదిరిగానే తయారుచేయించారు.

ఇక ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టును కూడా మార్చేశారు. అర్జున్ రెడ్డిలో హీరో బ్యాచ్ లో ఓ అమ్మాయి కూడా ఉంటుంది. తెలుగులో ఆ పాత్రను అదితి మయకల్ పోషించింది. ఇప్పుడు అదే క్యారెక్టర్ కోసం తమిళ్ లో ప్రియా ఆనంద్ ను తీసుకున్నారు. అన్నట్టు ఈ సినిమా రీషూట్ ఇవాళ్టి నుంచి చెన్నైలో ప్రారంభమైంది.

First Published:  20 Feb 2019 4:30 AM GMT
Next Story