Telugu Global
Health & Life Style

ఎముకలు బలంగా ఉండాలంటే.... ఈ మూడు పదార్ధాలు తప్పనిసరి!

మన శరీరానికి అకారంతోపాటు గట్టిదనాన్ని ఇచ్చేవి ఎముకలు. అవి ఎంత గట్టిగా, దృఢంగా ఉంటే…. మన శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. యుక్తవయస్సు వచ్చే వరకు శరీరంలోని పలు మినరల్స్ ఎముకలను గట్టిగా మారుస్తాయి. మనకు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎముకల ద్రవ్యరాశి పెరుగుతుంది. ఆ వయస్సు వచ్చేంత వరకు ఎముకలు గట్టిగా ఉండాల్సిందే. లేదంటే వయస్సు మీద పడుతున్న కొద్దీ సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే…. కొన్ని సూచనలు పాటించాల్సిందే. పోషకాలు ఉన్న […]

ఎముకలు బలంగా ఉండాలంటే.... ఈ మూడు పదార్ధాలు తప్పనిసరి!
X

మన శరీరానికి అకారంతోపాటు గట్టిదనాన్ని ఇచ్చేవి ఎముకలు. అవి ఎంత గట్టిగా, దృఢంగా ఉంటే…. మన శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. యుక్తవయస్సు వచ్చే వరకు శరీరంలోని పలు మినరల్స్ ఎముకలను గట్టిగా మారుస్తాయి. మనకు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎముకల ద్రవ్యరాశి పెరుగుతుంది. ఆ వయస్సు వచ్చేంత వరకు ఎముకలు గట్టిగా ఉండాల్సిందే. లేదంటే వయస్సు మీద పడుతున్న కొద్దీ సమస్యలు వస్తుంటాయి.

అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే…. కొన్ని సూచనలు పాటించాల్సిందే. పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాల్సిందే. ఈ మూడు పోషకాలు తీసుకున్నట్లయితే… ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు… ఎముకల ద్రవ్యరాశిని పెంచుతాయి. ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తాయి. మరి ఆ పోషకాలేంటో ఓ సారి చూడండి.

కాల్షియం

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. ఎముకలు గట్టిగా,దృఢంగా ఉండాటానికి కాల్షియం తోడ్పడుతుంది. కావాల్సినంత కాల్షియం లేనట్లయితే… ఎముకలు పెళుసుగా మారుతాయి. దీంతో ఎముకలు విరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదు కాల్షియం తీసుకోవాలి. పాలు, పన్నీర్, పెరుగు, కోడిగుడ్లు, క్యాబేజీ, పాలకూర, కాలిఫ్లవర్ వంటి వాటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి మనం క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే… శరీరంలో ఉన్న కణజాలం ఉత్తేజంగా పనిచేస్తుంది.

విటమిన్ డి

శరీరానికి కావాల్సిన విటమిన్ డి లేనట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి ని సన్‌షైన్‌ విటమిన్ అని కూడా అంటారు. ప్రతిరోజు ఎండలో కొద్దిసమయం గడిపినట్లయితే… ఈ విటమిన్ దానికదే వస్తుంది. ఎముకలు గట్టిగా ఉండాలంటే విటమిన్ డి తప్పనిసరి. గుడ్డులోని పచ్చసొన,పాలు, చేపలు, పుట్టగొడుగులు తరచుగా ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి. దీంతోపాటు ప్రతిరోజు ఉదయం కొంత సమయం ఎండలో నిలుచుండేలా ప్లాన్ చేసుకోవాలి.

విటమిన్ కె

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ కె తప్పనిసరి. ఎముకలు గట్టిగా ఉండటంతోపాటు రక్తనాళాలు కూడా దృఢంగా ఉండేందుకు విటమిన్ కె చాలా అవసరం. పాలకూర, కివి ఫ్రూట్, పెరుగు, అవకాడో, బ్రొకొలిలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

First Published:  20 Feb 2019 6:55 PM GMT
Next Story