Telugu Global
Cinema & Entertainment

దానయ్య తో రవితేజ

ప్రస్తుతం ఫ్లాప్స్ తో సావాసం చేస్తున్న రవితేజ, వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో “డిస్కో రాజా” అనే సినిమా చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ తన కెరీర్ లో పోషించనటువంటి క్యారెక్టర్ లో నటించబోతున్నాడని టాక్. ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత రవితేజ తన తదుపరి సినిమాని డి.వి.వి ఎంటర్ టైన్ […]

దానయ్య తో రవితేజ
X

ప్రస్తుతం ఫ్లాప్స్ తో సావాసం చేస్తున్న రవితేజ, వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో “డిస్కో రాజా” అనే సినిమా చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ తన కెరీర్ లో పోషించనటువంటి క్యారెక్టర్ లో నటించబోతున్నాడని టాక్.

ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

ఈ సినిమా తరువాత రవితేజ తన తదుపరి సినిమాని డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయబోతున్నాడు. ఇప్పటికే డి.వి.వి దానయ్య రవితేజని కలిసి డేట్స్ తీసుకున్నాడట. ఈ సినిమాతో ఒక్క కొత్త కుర్రాణ్ణి ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నాడు రవితేజ.

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే “వినయ విధేయ రామ” సినిమాతో భారీగా నష్టపోయిన డి.వి.వి దానయ్య ప్రస్తుతం “ఆర్.ఆర్.ఆర్” సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

First Published:  21 Feb 2019 2:15 AM GMT
Next Story