మైత్రి మూవీస్, మహేష్ బాబు సినిమా ఆగిపోయింది ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “మహర్షి” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన కథని రెడీ చేసే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు మహేష్ బాబుతో సినిమా నిర్మించే ప్రయత్నాన్ని ఆపేయాలని చూస్తున్నారట.

ఎందుకంటే వరుసగా ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కష్టాల్లో కూరుకు పోయింది ఈ ప్రొడక్షన్ హౌస్. ఈ రెండు సినిమాలు మాత్రమే కాక మరికొన్ని సినిమాలపై కూడా వీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కి రాలేదట. ఈ నేపధ్యంలో వారు మహేష్ బాబుతో నిర్మించాల్సిన సినిమాను వదలుకున్నట్లుగా కొందరు చెబుతున్నారు.

అయితే సుకుమార్ ఈ సినిమా కోసం మైత్రి వారిని భారీ బడ్జెట్ కోరాడట. ఇక భారీ బడ్జెట్ ఇవ్వడం సాధ్యం కాదని భావించిన మైత్రి సంస్థ సినిమాని ఆపేయాలని డిసైడ్ అయిందట. సుకుమార్ కి వేరే ప్రొడ్యూసర్ దొరికే గ్యాప్ లో మహేష్ బాబు అనిల్ రావిపూడి తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.