Telugu Global
Cinema & Entertainment

"ఎఫ్ 3" లో రవితేజ బదులు నితిన్

దిల్ రాజు ప్రొడ్యూసర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా “ఎఫ్ 2”. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు వంద కోట్ల వరకు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాకి పక్కా సీక్వెల్ తీస్తాను అని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. ఈ సీక్వెల్ లో రవితేజ ఉంటాడని ఫిలిం […]

ఎఫ్ 3 లో రవితేజ బదులు నితిన్
X

దిల్ రాజు ప్రొడ్యూసర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా “ఎఫ్ 2”. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు వంద కోట్ల వరకు కొల్లగొట్టింది.

ఇక ఈ సినిమాకి పక్కా సీక్వెల్ తీస్తాను అని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. ఈ సీక్వెల్ లో రవితేజ ఉంటాడని ఫిలిం నగర్ లో మొన్నటి వరకు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ లో రవితేజ ప్లేస్ లో ఒక యంగ్ హీరో నటించబోతున్నాడట. ఆ యంగ్ హీరో నే నితిన్.

రవితేజ తో “రాజా ది గ్రేట్” సీక్వెల్ ని తెరకెక్కించి… నితిన్ ని “ఎఫ్ 2” సీక్వెల్ లో భాగం చేద్దాం అనేది దిల్ రాజు ప్లాన్ అంట.

మరి ఈ విషయం పై దిల్ రాజు క్యాంపు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అనిల్ రావిపూడి “ఎఫ్ 2” సీక్వెల్ కంటే కూడా వేరే కథ మీద వర్క్ చేస్తున్నాడు.

First Published:  20 Feb 2019 10:49 PM GMT
Next Story