Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజు కి మరోసారి షాక్ ఇచ్చిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. ఈ సినిమా తరువాత దిల్ రాజు మళ్ళీ “మహర్షి” లాంటి కథ తీసుకొని వెళ్లి మహేష్ బాబు తో సినిమా సైన్ చేయించుకున్నాడు. అయితే “మహర్షి” సినిమాని దిల్ రాజు సోలో ప్రొడ్యూసర్ గా చేద్దాం అనుకున్నాడు. కానీ మహేష్ బాబు గతంలో ఇచ్చిన మాట కోసం అశ్వినీదత్‌ను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేశాడట. మహేష్ […]

దిల్ రాజు కి మరోసారి షాక్ ఇచ్చిన మహేష్ బాబు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. ఈ సినిమా తరువాత దిల్ రాజు మళ్ళీ “మహర్షి” లాంటి కథ తీసుకొని వెళ్లి మహేష్ బాబు తో సినిమా సైన్ చేయించుకున్నాడు.

అయితే “మహర్షి” సినిమాని దిల్ రాజు సోలో ప్రొడ్యూసర్ గా చేద్దాం అనుకున్నాడు. కానీ మహేష్ బాబు గతంలో ఇచ్చిన మాట కోసం అశ్వినీదత్‌ను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేశాడట. మహేష్ బాబు మాట కాదనలేక దిల్ రాజు కూడా ఓకే చెప్పాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఇదే ప్రాజెక్టులో పివిపి మరో నిర్మాతగా వచ్చి చేరాడు.

ఇక మహేష్ బాబు “మహర్షి” తరువాత సుకుమార్ తో ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా ఇంకా ఆలస్యం అవుతుండటంతో అనిల్ రావిపూడి తో సినిమా చేద్దాం అనేది మహేష్ బాబు ప్లాన్. ఈ సినిమాని కూడా దిల్ రాజు సోలో గా ప్రొడ్యూసర్ చేయాలి. కానీ ఈ ప్రాజెక్ట్ లో ప్రొడ్యూసర్ గా అనిల్ సుంకర ని కూడా తీసుకున్నాడట మహేష్ బాబు.

ఆల్రెడీ “మహర్షి” అప్పుడే దిల్ రాజుకి మహేష్ బాబు షాక్ ఇచ్చాడు అనుకుంటే అనిల్ రావిపూడి సినిమా టైం కి ఇంకా పెద్ద షాక్ ఇచ్చేశాడు.

First Published:  22 Feb 2019 5:27 AM GMT
Next Story