Telugu Global
Cinema & Entertainment

చైతూ హీరోయిన్ మళ్లీ మారిపోయింది

అసలే సినిమా ఆలస్యమైంది. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైమ్ లో మార్పుచేర్పులు చేస్తున్నారు మేకర్స్. వెంకీ మామ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా లాంఛ్ అయి చాన్నాళ్లయింది. ఈపాటికి రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ కావాలి. కానీ ప్రీ-ప్రొడక్షన్ వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఇక రేపట్నుంచి రెగ్యులర్ షూటింగ్ అనగా, అంతలోనే హీరోయిన్ మారిపోయింది. వెంకీ మామ సినిమాలో నాగచైతన్య సరసన ముందుగా రకుల్ ను […]

చైతూ హీరోయిన్ మళ్లీ మారిపోయింది
X

అసలే సినిమా ఆలస్యమైంది. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైమ్ లో మార్పుచేర్పులు చేస్తున్నారు మేకర్స్. వెంకీ మామ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా లాంఛ్ అయి చాన్నాళ్లయింది. ఈపాటికి రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ కావాలి. కానీ ప్రీ-ప్రొడక్షన్ వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఇక రేపట్నుంచి రెగ్యులర్ షూటింగ్ అనగా, అంతలోనే హీరోయిన్ మారిపోయింది.

వెంకీ మామ సినిమాలో నాగచైతన్య సరసన ముందుగా రకుల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఆ విషయాన్ని రకుల్ కూడా కన్ ఫర్మ్ చేసింది. కానీ అంతలోనే ఆమె స్థానంలో నభా నటేష్ ను తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకొని 24 గంటలైనా గడవకముందే మళ్లీ ఆమెను కూడా తప్పించారు. ఇప్పుడా స్థానంలో రాశిఖన్నాను తీసుకోవాలనుకుంటున్నారట.

అటు వెంకీ సరసన హీరోయిన్ ను కూడా ఇలానే మార్చేశారు. ముందుగా తమన్నాను ఫిక్స్ చేశారు. ఆమె కూడా ఈ విషయాన్ని నిర్థారించింది. తర్వాత మిల్కీబ్యూటీని తప్పించి, పాయల్ రాజ్ పుత్ ను పెట్టారు. ఆమెనైనా కొనసాగిస్తారో లేదో చూడాలి.

First Published:  21 Feb 2019 8:01 PM GMT
Next Story