Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజు మరో భారీ బెట్టింగ్

ఈమధ్య డిస్ట్రిబ్యూషన్ కాస్త తగ్గించాడు దిల్ రాజు. ఒకవేళ పంపిణీ చేయాల్సి వచ్చినా రేషియో మీద చేస్తున్నాడు తప్ప గంపగుత్తగా హక్కులు తీసుకున్న సందర్భాలు లేవు. గతంలో తగిలిన ఎదురుదెబ్బల కారణంగా దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చాడు. అలాంటి నిర్మాతను కూడా 118 సినిమా ఆకట్టుకుంది. అవును.. ఈ సినిమాను ప్రత్యేకంగా తిలకించాడు దిల్ రాజు. కేవలం నైజాం రైట్స్ అప్పగించడం కోసం మాత్రమే అతడ్ని సంప్రదించారు. కానీ సినిమా దిల్ రాజుకు బాగా నచ్చింది. […]

దిల్ రాజు మరో భారీ బెట్టింగ్
X

ఈమధ్య డిస్ట్రిబ్యూషన్ కాస్త తగ్గించాడు దిల్ రాజు. ఒకవేళ పంపిణీ చేయాల్సి వచ్చినా రేషియో మీద చేస్తున్నాడు తప్ప గంపగుత్తగా హక్కులు తీసుకున్న సందర్భాలు లేవు. గతంలో తగిలిన ఎదురుదెబ్బల కారణంగా దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చాడు. అలాంటి నిర్మాతను కూడా 118 సినిమా ఆకట్టుకుంది.

అవును.. ఈ సినిమాను ప్రత్యేకంగా తిలకించాడు దిల్ రాజు. కేవలం నైజాం రైట్స్ అప్పగించడం కోసం మాత్రమే అతడ్ని సంప్రదించారు. కానీ సినిమా దిల్ రాజుకు బాగా నచ్చింది. వెంటనే నైజాంతో పాటు ఏపీ రైట్స్ కూడా తీసుకున్నాడు. అప్పటికే సీడెడ్ బిజినెస్ క్లోజ్ అయింది. లేదంటే ఆ రైట్స్ కూడా తీసుకునేవాడు.

ఆంధ్రా, సీడెడ్, నైజాం కలిపి ఈ సినిమాను 9 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. వీటిలో నైజాం, ఆంధ్రాకు సంబంధించి దిల్ రాజు 7 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్టు టాక్. మరోవైపు హిందీ డబ్బింగ్ రూపంలో ఈ సినిమాకు ఇప్పటికే 4 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇంకా శాటిలైట్ అమ్మలేదు. చూస్తుంటే.. కల్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా సేఫ్ వెంచర్ గా మారేట్టుంది.

First Published:  22 Feb 2019 9:01 PM GMT
Next Story