Telugu Global
NEWS

ప్రపంచకప్ కు టీమిండియా ఆఖరి సన్నాహక సిరీస్

ఆసీస్ తో రేపటి నుంచి రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ విశాఖ వేదికగా 24న తొలి టీ-20 సమరం మార్చి 2న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే ఫైట్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ..హాట్ ఫేవరెట్ టీమిండియా సన్నాహాలు మరింత జోరందుకొన్నాయి.  ప్రపంచకప్ కు ముందు ఆఖరి ద్వైపాక్షిక సిరీస్ కు… భారత్ ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకూ జరిగే టీ-20, వన్డే […]

ప్రపంచకప్ కు టీమిండియా ఆఖరి సన్నాహక సిరీస్
X
  • ఆసీస్ తో రేపటి నుంచి రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్
  • విశాఖ వేదికగా 24న తొలి టీ-20 సమరం
  • మార్చి 2న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే ఫైట్

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ..హాట్ ఫేవరెట్ టీమిండియా సన్నాహాలు మరింత జోరందుకొన్నాయి. ప్రపంచకప్ కు ముందు ఆఖరి ద్వైపాక్షిక సిరీస్ కు… భారత్ ఆతిథ్యమిస్తోంది.

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకూ జరిగే టీ-20, వన్డే సిరీస్ ల్లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా సవాలు విసురుతోంది. తెలుగు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు… రెండుమ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

ప్రపంచకప్ కు సన్నాహకంగా…

2019 వన్డే ప్రపంచకప్ కు హాట్ ఫేవరెట్, రెండుసార్లు విశ్వవిజేత టీమిండియా ఉరకలేస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో మే 30న ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం…. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా సన్నాహాలు మరింత జోరందుకొన్నాయి.

భారత్ వేదికగా ఎనిమిదివారాలపాటు సాగే ఐపీఎల్ 12వ సీజన్ పోటీలకు ముందే…. ఆఖరి సన్నాహక సిరీస్ కు ఇటు టీమిండియా.. .అటు ఆస్ట్రేలియా సై అంటున్నాయి.

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకూ జరిగే ఏడుమ్యాచ్ ల ఈ ట్విన్ సిరీస్ లో భాగంగా…రెండుమ్యాచ్ ల టీ-20, ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లకు రంగం సిద్ధమయ్యింది.

కంగారూ గడ్డపై కొద్దివారాల క్రితం ముగిసిన వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకొన్న టీమిండియా…మరోసారి హాట్ ఫేవరెట్ గా సమరానికి సిద్ధమయ్యింది.

విశాఖ వేదికగా తొలిసమరం…

రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలి పోటీకి ఆంధ్ర క్రికెట్ సంఘం ఆతిథ్యమిస్తోంది. స్టీల్ సిటీ విశాఖ వేదికగా ఫిబ్రవరి 24న తొలి టీ-20 మ్యాచ్ నిర్వహిస్తారు.

సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 27న జరుగుతుంది.

హైదరాబాద్ లో తొలివన్డే…

ఆ తర్వాత జరిగే పాంచ్ పటాకా వన్డే సిరీస్ లోని తొలి సమరానికి… హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలిచింది. మార్చి 2న ఈమ్యాచ్ ను డే-నైట్ గా నిర్వహిస్తారు.

నాగపూర్ విదర్భ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా మార్చి 5న జరిగే రెండో వన్డేలో టీమిండియా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

మార్చి 8న రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మూడో వన్డే మ్యాచ్ నిర్వహిస్తారు.

సిరీస్ లోని నాలుగో వన్డే మ్యాచ్ కు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికకానుంది. మార్చి 10న జరిగే ఈ పోటీకి జార్ఖండ్ క్రికెట్ సంఘం ఆతిథ్యమిస్తోంది.

సిరీస్ లోని ఆఖరి వన్డే ..మార్చి 13న ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగుతుంది.

ప్రపంచకప్ సన్నాహాలకే కీలకంగా మారిన ఈ సిరీస్ లో టీమిండియా పూర్తిస్థాయి జట్టుతోనే పోటీకి దిగుతోంది. కంగారూ గడ్డపై ఆస్ట్రేలియాను 2-1తో అధిగమించి సిరీస్ నెగ్గిన టీమిండియా… సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై క్లీన్ స్వీప్ విజయం సాధించగలదా?… తెలుసుకోవాలంటే… మార్చి 13 వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  23 Feb 2019 5:35 AM GMT
Next Story