Telugu Global
NEWS

ఆ ఒక్క చాన్స్ కూడా ఇవ్వ‌ని కేసీఆర్ !

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వేడి పుట్టిస్తున్నాయి. ఐదు స్థానాలు భ‌ర్తీ కాబోతున్నాయి. మార్చి 12న పోలింగ్ జ‌ర‌గ‌బోతుంది. దీంతో ఇప్ప‌టికే న‌లుగురు అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించారు. హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్‌, కురుమ సంఘం అధ్య‌క్షుడు మ‌ల్లేశం కుర‌మ‌ను అభ్య‌ర్థులుగా నిర్ణ‌యించారు. మ‌రో సీటును మిత్ర‌ప‌క్షం ఎంఐఎంకి వ‌దిలిపెట్టారు. నాలుగు స్థానాల‌కు టీఆర్ఎస్ పోటీ చేస్తే…మిగిలిన ఐదో సీటు కోసం కాంగ్రెస్ పోటీ ప‌డాల‌ని అనుకుంది. సీనియ‌ర్ నేత‌లు చాలా […]

ఆ ఒక్క చాన్స్ కూడా ఇవ్వ‌ని కేసీఆర్ !
X

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వేడి పుట్టిస్తున్నాయి. ఐదు స్థానాలు భ‌ర్తీ కాబోతున్నాయి. మార్చి 12న పోలింగ్ జ‌ర‌గ‌బోతుంది. దీంతో ఇప్ప‌టికే న‌లుగురు అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించారు. హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్‌, కురుమ సంఘం అధ్య‌క్షుడు మ‌ల్లేశం కుర‌మ‌ను అభ్య‌ర్థులుగా నిర్ణ‌యించారు. మ‌రో సీటును మిత్ర‌ప‌క్షం ఎంఐఎంకి వ‌దిలిపెట్టారు.

నాలుగు స్థానాల‌కు టీఆర్ఎస్ పోటీ చేస్తే…మిగిలిన ఐదో సీటు కోసం కాంగ్రెస్ పోటీ ప‌డాల‌ని అనుకుంది. సీనియ‌ర్ నేత‌లు చాలా మంది ఆ సీటు కోసం పోటీ ప‌డాల‌ని క‌ల‌లు క‌న్నారు. కానీ ఐదు సీట్ల‌కు ఇప్పుడు టీఆర్ఎస్ పోటీ పెట్ట‌డంతో కాంగ్రెస్ నేత‌ల‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదు.

మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ చెక్ పెట్టారు. శాస‌న‌మండ‌లిలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేయాల‌ని ఎత్తుగ‌డ వేశారు. టీఆర్ఎస్‌కు ఐదో సీటు సంఖ్యా బ‌లం లేకున్నా అభ్య‌ర్థిని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

కానీ కాంగ్రెస్‌లోనే కొంద‌రు నేత‌లు జంప్ అవుతార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఐదో సీటుకు టీఆర్ఎస్ పోటీ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు నుంచి న‌లుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌మ‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని గులాబీ నేత‌లు అంటున్నారు. ఎమ్మెల్సీల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత‌కు ప‌ద‌వి వస్తుందో లేదో తెలియ‌దు. కానీ కంటి మీద కునుకు లేకుండా చేయ‌డం మాత్రం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. పోటీ పెట్ట‌క‌పోతే ఓ ర‌కంగా ప‌రువు పోతోంది. పోటీ పెడితే మ‌రో ర‌కంగా పోతోంది.

మొత్తానికి ప‌రువు పోవ‌డం మాత్రం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు మ‌థ‌న‌ప‌డుతున్నారు. అయితే ఒక‌వేళ పోటీ చేస్తే త‌మ 19 మంది ఎమ్మెల్యేలు త‌మ పార్టీ వెంట ఉన్నారా? లేదా ? అనే విష‌యం తెలుస్తుంది క‌దా? అందుకోసమైనా పోటీ ప‌డాల‌ని మ‌రో వ‌ర్గం ఆలోచిస్తోంది.

First Published:  22 Feb 2019 9:01 PM GMT
Next Story