Telugu Global
Cinema & Entertainment

ఈ వాయిదాలేంటి మహర్షి?

ఓ బడా సినిమా వస్తుందంటే అందులో కథ ఎలా ఉంటుందంటూ గాసిప్స్ రావడం సహజం. లేదంటే హీరో క్యారెక్టర్, ఫస్ట్ లుక్ పై ఊహాగానాలు వస్తుంటాయి. కానీ మహర్షి సినిమా మరీ విచిత్రం. ఈ సినిమా కంటెంట్ వదిలేసి రిలీజ్ పై పడ్డారు జనాలు. ఇది స్వయంగా మేకర్స్ చేసుకున్న స్వయంకృతాపరాధం. లెక్కప్రకారం మహర్షి సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాలి. డేటెడ్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తేదీ నుంచి సినిమా తప్పుకుంది. […]

ఈ వాయిదాలేంటి మహర్షి?
X

ఓ బడా సినిమా వస్తుందంటే అందులో కథ ఎలా ఉంటుందంటూ గాసిప్స్ రావడం సహజం. లేదంటే హీరో క్యారెక్టర్, ఫస్ట్ లుక్ పై ఊహాగానాలు వస్తుంటాయి. కానీ మహర్షి సినిమా మరీ విచిత్రం. ఈ సినిమా కంటెంట్ వదిలేసి రిలీజ్ పై పడ్డారు జనాలు. ఇది స్వయంగా మేకర్స్ చేసుకున్న స్వయంకృతాపరాధం.

లెక్కప్రకారం మహర్షి సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాలి. డేటెడ్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తేదీ నుంచి సినిమా తప్పుకుంది. తాజాగా ఏప్రిల్ 25వ తేదీని ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ డేట్ నుంచి కూడా సినిమాను తప్పించే ఆలోచనలో యూనిట్ ఉందని తెలుస్తోంది.

మహర్షి సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ ఇంకా పూర్తికాలేదు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయట. దీంతో అనుకున్న టైమ్ కంటే మరో నెల రోజులు అదనంగా టైమ్ పడుతుందని లెక్కకట్టారు. దీంతో ఈ సినిమాను ఏకంగా ఏప్రిల్ నుంచి జూన్ కు వాయిదా వేయాలని అనుకుంటున్నారట. ఇలా సినిమా రిలీజ్ కు సంబంధించి మహర్షి పై రోజుకో పుకారు షికారు చేస్తోంది.

First Published:  22 Feb 2019 8:01 PM GMT
Next Story