Telugu Global
Cinema & Entertainment

మరోసారి ఒకే వేదికపైకి నందమూరి హీరోలు

ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ సందర్బంగా ఒకే వేదికపైకి వచ్చారు నందమూరి హీరోలు. అంతకంటే ముందు అరవింద సమేత సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కూడా వీళ్లంతా ఒకే స్టేజీపై కనిపించారు. ఇప్పుడు మరోసారి బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి ఒకే వేదికపైకి రాబోతున్నారు. కల్యాణ్ రామ్ నటించిన 118 మూవీకి సంబంధించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ ప్రీ-రిలీజ్ హంగామా జరగబోతోంది. ఈ […]

మరోసారి ఒకే వేదికపైకి నందమూరి హీరోలు
X

ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ సందర్బంగా ఒకే వేదికపైకి వచ్చారు నందమూరి హీరోలు. అంతకంటే ముందు అరవింద సమేత సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కూడా వీళ్లంతా ఒకే స్టేజీపై కనిపించారు. ఇప్పుడు మరోసారి బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి ఒకే వేదికపైకి రాబోతున్నారు.

కల్యాణ్ రామ్ నటించిన 118 మూవీకి సంబంధించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ ప్రీ-రిలీజ్ హంగామా జరగబోతోంది. ఈ వేడుకకు ఎన్టీఆర్, బాలకృష్ణ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు.

ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్, అతడి బ్యానర్ పై ఏకంగా ఓ సినిమానే చేశాడు. కల్యాణ్ రామ్ ను నష్టాల నుంచి బయటపడేశాడు. సో.. కల్యాణ్ రామ్ కోరితే ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీ. ఇక బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో కీలక పాత్ర పోషించాడు కల్యాణ్ రామ్. ఆ చనువుతో అడిగిన వెంటనే 118 ఫంక్షన్ కు రావడానికి ఒప్పుకున్నాడు బాలయ్య. ఇలా మరోసారి నందమూరి స్టార్ హీరోలంతా కలిసి ఒకే వేదికపై కనువిందు చేయబోతున్నారు.

First Published:  24 Feb 2019 10:00 AM GMT
Next Story