Telugu Global
National

చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం.. 300పైగా కార్లు దగ్ధం

బెంగళూరు ఎయిర్ షో ప్రాంతంలో 200పైగా కార్లు దగ్ధమైన సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే చెన్నైలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు పార్కింగ్ ప్రదేశంలో ఆపి ఉన్న 300పైగా కార్లు అగ్నికి ఆహుతైన సంఘటన చోటు చేసుకుంది. చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రి సమీపంలో ఓటో అనే ట్యాక్సీ కంపెనీకి చెందిన కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ట్యాక్సీ కంపెనీ ప్రస్తుతం మూసివేయడంతో సదరు సంస్థ కార్లను గత ఏడాది […]

చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం.. 300పైగా కార్లు దగ్ధం
X

బెంగళూరు ఎయిర్ షో ప్రాంతంలో 200పైగా కార్లు దగ్ధమైన సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే చెన్నైలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు పార్కింగ్ ప్రదేశంలో ఆపి ఉన్న 300పైగా కార్లు అగ్నికి ఆహుతైన సంఘటన చోటు చేసుకుంది.

చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రి సమీపంలో ఓటో అనే ట్యాక్సీ కంపెనీకి చెందిన కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ట్యాక్సీ కంపెనీ ప్రస్తుతం మూసివేయడంతో సదరు సంస్థ కార్లను గత ఏడాది కాలంగా ఇక్కడ పార్క్ చేసి ఉంచారు. అయితే మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి కార్లు కాలిపోతుండటాన్ని సెక్యూరిటీ గమనించి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించాడు.

దాదాపు 10 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు. కానీ విపరీతమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. కార్లు పార్క్ చేసిన సమీపంలో గత కొద్ది కాలంగా రసాయన వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. తొలుత అక్కడ మంటలు అంటుకొని క్రమంగా కార్ల వద్దకు చేరుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అక్కడ ఎండుగడ్డి కూడా ఎక్కువగా ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి.

ఓటో కంపెనీకి చెందిన ఈ కార్లు చాలా వరకు రిపేర్లకు గురైనవి, మరికొన్ని కొత్త కార్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  24 Feb 2019 7:18 AM GMT
Next Story