Telugu Global
National

రాహుల్‌కు పోటా పోటీ నివేదికలు!

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవాలు ఎదురయ్యాయి. గడిచిన ఐదు సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న నాయకులు, భవిష్యత్తులో ఎప్పుడు అధికారం వస్తుందో తెలియని నాయకులు గ్రూపులు కట్టడంలో మాత్రం ఒకటయ్యారని రాహుల్ గాంధీ ఒకింత ఆశ్చర్యపోయారట. ఈ ఆశ్చర్యానికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన నివేదిక ఒకటయితే మరొక వర్గం ఇచ్చిన నివేదిక మరో విధంగా ఉందని చెబుతున్నారు. […]

రాహుల్‌కు పోటా పోటీ నివేదికలు!
X

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవాలు ఎదురయ్యాయి. గడిచిన ఐదు సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న నాయకులు, భవిష్యత్తులో ఎప్పుడు అధికారం వస్తుందో తెలియని నాయకులు గ్రూపులు కట్టడంలో మాత్రం ఒకటయ్యారని రాహుల్ గాంధీ ఒకింత ఆశ్చర్యపోయారట.

ఈ ఆశ్చర్యానికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన నివేదిక ఒకటయితే మరొక వర్గం ఇచ్చిన నివేదిక మరో విధంగా ఉందని చెబుతున్నారు. ఈ రెండు నివేదికల్లోని ఏ ఒక్క అంశానికీ పోలిక లేదని, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తున్నాయని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.

రాహుల్ గాంధీ రేణిగుంట విమానాశ్రయంలో వియానం దిగినప్పటి నుంచి తిరుమల వెళ్లే వరకు ఆయన వెంట ఉన్న కొందరు నాయకులు ఒక నివేదికను, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మరొక నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. రెండో నివేదిక తన చేతికి వచ్చే వరకు మొదట ఇచ్చిన రిపోర్టు నిజమైనదని రాహుల్ గాంధీ భావించారని, భరోసా బహిరంగ సభ అనంతరం మరొక నివేదిక తన చేతికి ఇవ్వడంతో కంగుతిన్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో పార్టీ పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయింది అనుకుంటున్న సమయంలో పార్టీలో గ్రూపులు ఏమిటని రాహుల్ గాంధీ కొందరు నాయకులను ప్రశ్నించినట్లు సమాచారం. తనకు అందిన నివేదికలోని ఒక అంశానికి మరో అంశానికి పొంతన లేదని, రెండింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కూడా అర్థం అయిందని రాహుల్ గాంధీ సీనియర్ నాయకులతో అన్నట్లు చెబుతున్నారు.

ఈ పరిస్థితిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్ చాందిని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. తనకు వేరువేరుగా రెండు నివేదికలు ఇచ్చిన నాయకులు తక్షణమే ఢిల్లీ రావాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు పార్టీ నాయకుడొకరు తెలిపారు.

First Published:  23 Feb 2019 10:42 PM GMT
Next Story