Telugu Global
Cinema & Entertainment

షేడ్స్ ఆఫ్ సాహో.... చాప్టర్-2 వస్తోంది

ఫస్ట్ లుక్స్ నే డిఫరెంట్ గా ప్లాన్ చేసింది సాహో యూనిట్. ఫస్ట్ లుక్ అని చెప్పకుండా షేడ్స్ ఆఫ్ సాహో పేరిట మేకింగ్ వీడియోస్ విడుదల చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన వీడియో విడుదల చేయగా, అది సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ లో చాప్టర్-2 రాబోతోంది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మార్చి 3న […]

షేడ్స్ ఆఫ్ సాహో.... చాప్టర్-2 వస్తోంది
X

ఫస్ట్ లుక్స్ నే డిఫరెంట్ గా ప్లాన్ చేసింది సాహో యూనిట్. ఫస్ట్ లుక్ అని చెప్పకుండా షేడ్స్ ఆఫ్ సాహో పేరిట మేకింగ్ వీడియోస్ విడుదల చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన వీడియో విడుదల చేయగా, అది సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ లో చాప్టర్-2 రాబోతోంది.

ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2ను విడుదల చేయబోతున్నారు. ఈ వీడియోలో కేవలం శ్రద్ధాకపూర్ పాత్రను మాత్రమే పరిచయం చేస్తారా.. లేక శ్రద్ధాకపూర్-ప్రభాస్ జోడీని ప్రేక్షకులకు చూపిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

సుజీత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందంటున్నారు మేకర్స్. హాలీవుడ్ లో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ను తెలుగులో చూసినట్టు ఉంటుందంటున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా.. తెలుగు సినీ చరిత్రలోనే స్పెషల్ మూవీగా సోహో నిలిచిపోతుందని చెబుతున్నారు.

First Published:  24 Feb 2019 6:20 AM GMT
Next Story