Telugu Global
Cinema & Entertainment

సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్న హీరో

హీరోగా ఓ వెలుగు వెలిగిపోదాం అనుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండడంతో ఆఫర్లు, కాంబినేషన్లు కూడా బాగానే సెట్ అయ్యాయి. కానీ ఎన్ని చేసినా ప్లానింగ్, స్టోరీ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సరిగ్గా ఇక్కడే తప్పటడుగులు వేశాడు హీరో సందీప్ కిషన్. దీంతో మొన్నటివరకు హీరోగా కొనసాగిన ఈ హీరో, ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు-తమిళ భాషల్లో నరకాసురుడు అనే సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. అయితే అంతా అనుకుంటున్నట్టు […]

సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్న హీరో
X

హీరోగా ఓ వెలుగు వెలిగిపోదాం అనుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండడంతో ఆఫర్లు, కాంబినేషన్లు కూడా బాగానే సెట్ అయ్యాయి. కానీ ఎన్ని చేసినా ప్లానింగ్, స్టోరీ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సరిగ్గా ఇక్కడే తప్పటడుగులు వేశాడు హీరో సందీప్ కిషన్. దీంతో మొన్నటివరకు హీరోగా కొనసాగిన ఈ హీరో, ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలుగు-తమిళ భాషల్లో నరకాసురుడు అనే సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. అయితే అంతా అనుకుంటున్నట్టు ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరో కాదు. కేవలం ఓ క్యారెక్టర్ మాత్రమే. కాకపోతే హీరోయిన్ ఉంటుంది. అంతే తేడా. ఈ సినిమాలో అసలు హీరో అరవింద్ స్వామి. ఆమెకు జోడీగా శ్రియ నటిస్తోంది.

తనకు ఆ పాత్ర బాగా నచ్చడంతోనే ఒప్పుకున్నానంటున్నాడు సందీప్ కిషన్. అతడు ఎంత కవర్ చేసుకున్నప్పటికీ, వరుస ఫ్లాపులే సందీప్ కిషన్ ను ఇలా దిగజార్చేశాయనేది వాస్తవం. గతంలో హీరోగా కొనసాగుతున్న టైమ్ లో తెలుగు నుంచి ఇలాంటి క్యారెక్టర్ రోల్స్ కొన్ని సందీప్ వద్దకు వచ్చాయి. అప్పుడు వాటికి అతడు ఓకే చెప్పలేదు. ఇప్పుడు ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పాల్సిన పరిస్థితి. ఓడలు బల్లు అవుతాయంటే ఇదే.

First Published:  23 Feb 2019 7:02 PM GMT
Next Story