Telugu Global
NEWS

తలసాని సమావేశం ఫెయిల్ కావాలి: చంద్రబాబు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బిసీలను కూడగడుతున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ గుంటూరులో ఏర్పాటు చేస్తున్న బిసీల సమావేశం ఎట్టి పరిస్దితులలోను విజయవంతం కాకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలను ఆదేశించినట్లు సమాచారం. మార్చి 3వ తేదీన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గుంటూరులో బిసీలతో పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో తన సమాజిక వర్గమైన యాదవులను భారీ ఎత్తున కూడగట్టుకునే పనిని ప్రారంభించారు. ఇప్పటికే […]

తలసాని సమావేశం ఫెయిల్ కావాలి: చంద్రబాబు ఆదేశం
X

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బిసీలను కూడగడుతున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ గుంటూరులో ఏర్పాటు చేస్తున్న బిసీల సమావేశం ఎట్టి పరిస్దితులలోను విజయవంతం కాకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలను ఆదేశించినట్లు సమాచారం.

మార్చి 3వ తేదీన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గుంటూరులో బిసీలతో పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో తన సమాజిక వర్గమైన యాదవులను భారీ ఎత్తున కూడగట్టుకునే పనిని ప్రారంభించారు.

ఇప్పటికే తన సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులతో తలసాని చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆ పనిని పూర్తిచేసేందుకు నడుము బిగించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు పర్యటించిన తలసాని తన సామాజిక వర్గంతో పాటు బిసీ నాయకులను కూడా కలుసుకున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాటు చేస్తున్న సమావేశం ఎట్టి పరిస్దితులలోను విజయవంతం కాకూడదని పార్టీ నాయకులను ఆదేశించినట్లు సమాచారం.

ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బిసీ గర్జన విజయవంతం అయ్యిందని, ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాటు చేస్తున్న బిసీలతో సమావేశం కూడా విజయవంతం అయితే పార్టీకి ఇబ్బందులు తప్పవని చంద్రబాబు నాయుడు బిసీ నాయకులను హెచ్చరించినట్లు చెబుతున్నారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ బిసీలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ఇంకా వారం రోజులు గడువు ఉందని, ఈలోగా అన్ని జిల్లాలకు చెందిన బిసీ నాయకులతోను అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి తలసాని నిర్వహించనున్న బిసీల సమావేశాన్ని విజయవంతం కాకుండా చూడాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెబుతున్నారు.

First Published:  25 Feb 2019 1:41 AM GMT
Next Story