Telugu Global
Cinema & Entertainment

కల్యాణ్ రామ్ కూడా కన్నేశాడు

హీరో మహేష్ బాబు వెబ్ సిరీస్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. తన సొంత బ్యానర్ పై చార్లీ అనే వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడు మహేష్. ఇప్పుడీ దారిలోకి కల్యాణ్ రామ్ కూడా వచ్చాడు. తను కూడా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు ఈ నందమూరి హీరో. కల్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ పై తనే నిర్మాత, హీరోగా ఎక్కువగా సినిమాలు […]

కల్యాణ్ రామ్ కూడా కన్నేశాడు
X

హీరో మహేష్ బాబు వెబ్ సిరీస్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. తన సొంత బ్యానర్ పై చార్లీ అనే వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడు మహేష్. ఇప్పుడీ దారిలోకి కల్యాణ్ రామ్ కూడా వచ్చాడు. తను కూడా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు ఈ నందమూరి హీరో.

కల్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ పై తనే నిర్మాత, హీరోగా ఎక్కువగా సినిమాలు చేస్తుంటాడు కల్యాణ్ రామ్. ఇప్పుడీ బ్యానర్ ను మరింత విస్తరించే క్రమంలో వెబ్ సిరీస్ కూడా నిర్మిస్తామని ప్రకటించాడు. యూత్ ను దృష్టిలో పెట్టుకొని ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ను వెబ్ సిరీస్ గా ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు.

మహేష్ బాబు తీయబోయే చార్లీ వెబ్ సిరీస్ లో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఈ నిర్మాణ వ్యవహారాలన్నీ నమ్రత చూసుకుంటోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న వెబ్ సిరీస్ లో ఎవరు నటిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓ యంగ్ హీరో కోసం చూస్తున్నాడు కల్యాణ్ రామ్.

First Published:  24 Feb 2019 7:02 PM GMT
Next Story