Telugu Global
Cinema & Entertainment

"సై రా" .... అడ్డుకున్న ప్రజలు

మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా “సై రా నరసింహారెడ్డి”. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ ని బీదర్ లోని ఒక ప్రాంతంలో ప్లాన్ చేశాడు సురేందర్ రెడ్డి. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ ని బాగా తీయాలని అక్కడికి వెళ్ళిన మూవీ యూనిట్ కి […]

సై రా ....  అడ్డుకున్న ప్రజలు
X

మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా “సై రా నరసింహారెడ్డి”. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ ని బీదర్ లోని ఒక ప్రాంతంలో ప్లాన్ చేశాడు సురేందర్ రెడ్డి. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ ని బాగా తీయాలని అక్కడికి వెళ్ళిన మూవీ యూనిట్ కి అక్కడి ప్రజలు అడ్డు చెప్పారట. షూటింగ్ స్పాట్ లో ఉన్న కత్తులు చూసి “ఇలాంటి సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయవద్దు” అని షూటింగ్ ని అడ్డుకున్నారట.

పోలీస్ లు కూడా జనాల్ని కంట్రోల్ చేయలేకపోయారని తెలుస్తోంది. ఇక పోలీస్ లు కూడా ఏం చేయలేక మూవీ యూనిట్ కి సర్ది చెప్పి అక్కడనుంచి పంపించేశారట.

మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య వెళ్లి షూటింగ్ జరుపుకొని వచ్చేద్దాం అనుకున్న “సై రా” టీం కి చుక్కెదురైంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.

First Published:  25 Feb 2019 3:40 AM GMT
Next Story