Telugu Global
NEWS

ఉత్తమ్‌ను మార్చండి మహాప్రభో: కాంగ్రెస్ సీనియర్లు

“వచ్చే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనీసం ఎనిమిది స్థానాలు గెలవాలంటే…. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిందే. ఆయన ఒంటెత్తు పోకడల వల్ల పార్టీలో సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి అదికూడా ఒక కారణం” అని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు మొర పెట్టుకున్నట్లు చెబుతున్నారు. […]

ఉత్తమ్‌ను మార్చండి మహాప్రభో: కాంగ్రెస్ సీనియర్లు
X

“వచ్చే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనీసం ఎనిమిది స్థానాలు గెలవాలంటే…. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిందే. ఆయన ఒంటెత్తు పోకడల వల్ల పార్టీలో సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి అదికూడా ఒక కారణం” అని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు మొర పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల్లో పొత్తుల నుంచి, టికెట్ల పంపిణీ వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని ఆలస్యం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎలాగో గెలవలేకపోయాం…. లోక్‌సభ ఎన్నికల్లో నైనా విజయం సాధించాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్పు అనివార్యం అని విన్నవించినట్లు చెబుతున్నారు. పార్టీలో సీనియర్లను కలుపుకుపోయే మనస్తత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదని, దాని వల్లే సీనియర్లలో కొందరు గత శాసనసభ ఎన్నికలలో పూర్తి స్థాయిలో పని చేయలేక పోయారు అని చెప్పినట్లు సమాచారం.

ఎన్నికలలోపు పిసిసి అధ్యక్షుడిని మారిస్తే కనీసం ఐదారు స్థానాల్లోనైనా పార్టీ గెలుస్తుందని సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి ఒక నివేదిక ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆ నివేదికను ఇటీవల శాసనసభ ఎన్నికల్లో టిక్కెట్ దక్కని మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి రూపొందించారని, ఇందుకోసం ఆయన కొందరు సీనియర్లను కూడా సంప్రదించారని అంటున్నారు.

అయితే మరో వర్గం మాత్రం శశిథర్ రెడ్డి తనకు టిక్కెట్ రాలేదనే కోపంతోనే ఈ నివేదిక రూపొందించారని, నిజానికి తెలంగాణలో సీనియర్ నాయకుల్లో ఎవరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్ల వ్యతిరేకత లేదని అంటున్నారు.

మొత్తానికి రెండు వర్గాలు ఎవరికి వారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నివేదికలు మాత్రం దండిగానే ఇస్తున్నారని, రాహుల్ గాంధీ ఈ నివేదికలను పరిశీలించడమే కాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  24 Feb 2019 11:15 PM GMT
Next Story