Telugu Global
NEWS

మీరు వేస్ట్.... స్పందించడం రాదు: మంత్రులపై బాబు గుస్సా

“క్యాబినెట్ లో సీనియర్ మంత్రులు ఉన్నారు.  వీరంతా అనుభవం ఉన్నవారు. అయినా మీకు దేనికి ఎలా స్పందించాలో ఇప్పటి వరకు  తెలియలేదంటే ఏమనుకోవాలి. మీరంతా వేస్ట్” ఇది చంద్రబాబు తన సహచర సీనియర్ మంత్రులపై మండిపడ్డ తీరు. అమరావతిలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు సీనియర్ మంత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రులు అందరిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మండిపడినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి అంశాలపై స్పందించడం రాలేదంటూ చంద్రబాబు […]

మీరు వేస్ట్.... స్పందించడం రాదు: మంత్రులపై బాబు గుస్సా
X

“క్యాబినెట్ లో సీనియర్ మంత్రులు ఉన్నారు. వీరంతా అనుభవం ఉన్నవారు. అయినా మీకు దేనికి ఎలా స్పందించాలో ఇప్పటి వరకు తెలియలేదంటే ఏమనుకోవాలి. మీరంతా వేస్ట్” ఇది చంద్రబాబు తన సహచర సీనియర్ మంత్రులపై మండిపడ్డ తీరు. అమరావతిలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు సీనియర్ మంత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రులు అందరిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మండిపడినట్లు సమాచారం.

రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి అంశాలపై స్పందించడం రాలేదంటూ చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. “ భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి దీటైన సమాధానం చెప్పడంలో మాత్రం మంత్రులు ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా సీనియర్ మంత్రులు ఎవరు గొంతు విప్పడానికి భయపడుతున్నారు. ఏమిటిదంతా” అంటూ చంద్రబాబు నాయుడు సీనియర్ మంత్రులపై మండిపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎన్నికలకు ఇంకా ఎంతో కాలం లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రులు, పార్టీ నాయకులు దీటుగా స్పందించకపోతే అధికారంలోకి రావడం కష్టమని చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పినట్లు సమాచారం. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ పైన, వ్యక్తిగతంగా తన పైనా భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్, వైఎస్సార్ సీపీ విమర్శలు చేస్తున్నాయని, ఆ విమర్శలపై ఎవరూ సరిగా స్పందించడం లేదని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారని, ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన వారు ఎవరూ పెదవి విప్పడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. “ మీరు మౌనంగా ఉంటే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు నిజమవుతాయి. దాని వల్ల నష్టపోయేది పార్టీ మాత్రమే” అని చంద్రబాబు నాయుడు మంత్రులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈ సమావేశం అనంతరం కొందరు సీనియర్ మంత్రులు ఇన్ని తప్పులు చేస్తూ స్పందించ మంటే ఎలా సాధ్యమవుతుందని సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. నాలుగున్నరేళ్లు పాటు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా మనమే తప్పు చేశామని, పైగా ఇన్నాళ్లు భారతీయ జనతా పార్టీ ని నెత్తిన పెట్టుకుని ఊరేగామని, ఇప్పుడు వాళ్ళను విమర్శిస్తే ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

గత కొంతకాలంగా తమ నాయకుడు చంద్రబాబు నాయుడు చాలా అసహనంగా ఉంటున్నారని, ఆ అసహనాన్ని తమ మీద కూడా ప్రదర్శించారని మంత్రులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

First Published:  26 Feb 2019 1:12 AM GMT
Next Story