Telugu Global
Cinema & Entertainment

అబ్బో.... రిలీజ్ కు ముందే సీక్వెల్ ప్రకటించారు

సినిమా హిట్ అయితే సీక్వెల్ తీస్తారు. అది కామన్. సినిమా రిలీజ్ అవ్వకముందే సీక్వెల్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నాడు. దానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. ఈ సినిమా సీక్వెల్ పేరు డబుల్ ఇస్మార్ట్. అవును.. ఇస్మార్ట్ శంకర్ స్టోరీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు పూరి. సినిమా సెట్స్ పై ఉంటుండగానే లొకేషన్ […]

అబ్బో.... రిలీజ్ కు ముందే సీక్వెల్ ప్రకటించారు
X

సినిమా హిట్ అయితే సీక్వెల్ తీస్తారు. అది కామన్. సినిమా రిలీజ్ అవ్వకముందే సీక్వెల్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నాడు. దానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. ఈ సినిమా సీక్వెల్ పేరు డబుల్ ఇస్మార్ట్.

అవును.. ఇస్మార్ట్ శంకర్ స్టోరీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు పూరి. సినిమా సెట్స్ పై ఉంటుండగానే లొకేషన్ లోనే సన్నివేశంలో, డైలాగ్ లో మార్పుచేర్పులు చేయడం ఈ దర్శకుడికి అలవాటు. ఆ సెట్స్ పై చర్చిస్తున్న టైమ్ లోనే ఈ సీక్వెల్ ఆలోచన వచ్చిందట. ఆలోచన వచ్చిన వెంటనే సీక్వెల్ ప్రకటించేశాడు.

అంతా బాగుంది కానీ సినిమా హిట్ అయితే సీక్వెల్ వస్తుందనే విషయాన్ని పూరి జగన్నాధ్ మరిచిపోయినట్టున్నాడు. ఒకవేళ ఇస్మార్ట్ శంకర్ ఫ్లాప్ అయితే రామ్ మరోసారి కాల్షీట్లు ఇవ్వడు. ఇచ్చినా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కోసం అస్సలు ముందుకురాడు. సో.. సీక్వెల్ ప్రకటించడం ద్వారా తనపై తాను మరింత ఒత్తిడి పెంచుకున్నాడు పూరి జగన్నాధ్.

First Published:  26 Feb 2019 7:43 AM GMT
Next Story