Telugu Global
Cinema & Entertainment

కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్

ఇటీవలే “ఎన్టీఆర్” బయోపిక్ లో నందమూరి హరి క్రిష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన “118” కి రెడీ అవుతున్నాడు. సినిమాటోగ్రాఫర్ కే.వి గుహన్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. పూర్తి స్థాయి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఒక కొత్త సినిమా కథని […]

కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్
X

ఇటీవలే “ఎన్టీఆర్” బయోపిక్ లో నందమూరి హరి క్రిష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన “118” కి రెడీ అవుతున్నాడు.

సినిమాటోగ్రాఫర్ కే.వి గుహన్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. పూర్తి స్థాయి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఒక కొత్త సినిమా కథని ఓకే చేసాడట కళ్యాణ్ రామ్. అవును కొత్త కుర్రాడు అయిన వశిష్ట…. కళ్యాణ్ రామ్ కి ఒక కథ చెప్పాడని తెలుస్తోంది. కథలోని ఫ్యామిలీ డ్రామా , ఎమోషన్స్ నచ్చిన కళ్యాణ్ రామ్ వెంటనే ఈ సినిమాకి ఓకే చెప్పాడని అంటున్నారు.

ఈ సినిమా కథ మొత్తం ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లోనే రాసుకున్నాడట వశిష్ట. అతి త్వరలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కళ్యాణ్ రామ్ మిగతా విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ తో పాటు “మజ్ను” ఫేం విరించి వర్మ దర్శకత్వంలో కూడా కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేసే అవకాశం ఉంది.

First Published:  26 Feb 2019 2:08 AM GMT
Next Story