Telugu Global
Cinema & Entertainment

కరెంట్ బిల్లులు, థియేటర్ అద్దెలైనా మిగులుతాయి..... దుకాణం సర్దేసిన మహానాయకుడు

నిన్నటితో మహానాయకుడు విడుదలైన 3 రోజులైంది. ఫస్ట్ వీకెండ్ నాటికే ఈ సినిమా తేలిపోయింది. మహా అయితే మరో 2 రోజులు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో నిలిచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో మరో సినిమా లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మహానాయకుడ్ని ఆడిస్తున్నారు. లేదంటే ఈ సినిమాను ఎప్పుడో థియేటర్ల నుంచి లేపేసేవారు ఎగ్జిబిటర్లు. ఎందుకంటే మహానాయకుడు సినిమాకు వస్తున్న వసూళ్లతో కనీసం థియేటర్ అద్దెలు, కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి. అందుకే […]

కరెంట్ బిల్లులు, థియేటర్ అద్దెలైనా మిగులుతాయి..... దుకాణం సర్దేసిన మహానాయకుడు
X

నిన్నటితో మహానాయకుడు విడుదలైన 3 రోజులైంది. ఫస్ట్ వీకెండ్ నాటికే ఈ సినిమా తేలిపోయింది. మహా అయితే మరో 2 రోజులు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో నిలిచే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో మరో సినిమా లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మహానాయకుడ్ని ఆడిస్తున్నారు. లేదంటే ఈ సినిమాను ఎప్పుడో థియేటర్ల నుంచి లేపేసేవారు ఎగ్జిబిటర్లు.

ఎందుకంటే మహానాయకుడు సినిమాకు వస్తున్న వసూళ్లతో కనీసం థియేటర్ అద్దెలు, కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి. అందుకే రేపట్నుంచి ఎగ్జిబిటర్లు కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు.

మరో సినిమా అందుబాటులో లేకపోతే, మహానాయకుడు సినిమాను ప్రదర్శించకుండా థియేటర్లు మూసేయాలని కొందరు నిర్ణయించారు. ఆ మేరకు కరెంట్ బిల్లులు, థియేటర్ అద్దెలైనా మిగులుతాయని భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 రోజుల్లో మహానాయకుడు సినిమాకు వచ్చిన షేర్ ఇలా ఉంది.

నైజాం – రూ. 64 లక్షలు
సీడెడ్ – రూ. 28 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 28 లక్షలు
ఈస్ట్ – రూ. 17 లక్షలు
వెస్ట్ – రూ. 18 లక్షలు
గుంటూరు – రూ. 62 లక్షలు
కృష్ణా – రూ. 29 లక్షలు
నెల్లూరు – రూ. 10 లక్షలు

First Published:  25 Feb 2019 8:42 PM GMT
Next Story