నాగార్జున కి హీరోయిన్ దొరికేసింది

అక్కినేని నాగార్జున “దేవదాస్” సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా స్టార్ట్ చేయలేదు. కానీ నాగార్జున మాత్రం “మన్మధుడు 2” చేయడానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.

ఇక ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని నాగార్జున రాహుల్ రవీంద్రన్ కి అప్పగించాడు. “చి.లా.సౌ” సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ కి ఇది రెండో సినిమా. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటించబోతుంది అనే వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున సరసన రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందట. రకుల్ ప్రీత్ సింగ్ గతంలో “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలో అక్కినేని నాగ చైతన్య సరసన నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి “ఆర్ ఎక్స్ 100” ఫేం చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 12 న అధికారికంగా లాంచ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం యూరోప్ లో ఉండబోతుంది.