Telugu Global
NEWS

తెలంగాణ మంత్రులు ఉత్సవ విగ్రహాలేనా!

రెండు నెలల ఎదురుచూపుల తర్వాత… ఎవరు రాజు… ఎవరు మంత్రి అనే ఉత్కంఠ తర్వాత… తెలంగాణ రాష్ట్ర సమితి మేధోమథనం తర్వాత… తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత… ఎట్టకేలకు తెలంగాణ మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. తనను ప్రశ్నించే వారిని కానీ, సలహాలు, సూచనలు ఇచ్చేవారిని కానీ, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సీనియర్లుగా ఉన్నవారిని కానీ సంప్రదించకుండా తనకు నచ్చిన వారికి, తన మాటే వేదవాక్కు గా భావించే వారికి మంత్రి పదవులు […]

తెలంగాణ మంత్రులు ఉత్సవ విగ్రహాలేనా!
X

రెండు నెలల ఎదురుచూపుల తర్వాత… ఎవరు రాజు… ఎవరు మంత్రి అనే ఉత్కంఠ తర్వాత… తెలంగాణ రాష్ట్ర సమితి మేధోమథనం తర్వాత… తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత… ఎట్టకేలకు తెలంగాణ మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. తనను ప్రశ్నించే వారిని కానీ, సలహాలు, సూచనలు ఇచ్చేవారిని కానీ, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సీనియర్లుగా ఉన్నవారిని కానీ సంప్రదించకుండా తనకు నచ్చిన వారికి, తన మాటే వేదవాక్కు గా భావించే వారికి మంత్రి పదవులు ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

ఈ మంత్రివర్గ కూర్పులో పార్టీ నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కాని, సీనియర్ నాయకుడు హరీష్ రావు కు చెందిన వర్గాన్ని కానీ, తన కుమార్తె కల్వకుంట్ల కవిత సూచించిన వారికి గాని ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదు.

తాను మెచ్చిన వారికి తన వర్గం వారికే మంత్రి పదవులు ఇచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ మంత్రులు ఎలా పనిచేయాలో కూడా ఆయనే నిర్ణయిస్తున్నారు. చివరకు మంత్రులు తమ వ్యక్తిగత సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా లేకుండా ఆయనే నియమిస్తున్నారు. దీనికి గత మంత్రివర్గంలో కొందరు మంత్రులకు సంబంధించిన కార్యదర్శులు, పిఆర్ఓలు చేతివాటం చూపించారని, దీని వల్ల తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని అపప్రద వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి తన చర్యలను సమర్థించుకుంటున్నారు.

అయితే గత మంత్రివర్గంలో ఉన్న సీనియర్ మంత్రుల కార్యదర్శులు గాని, ప్రజా సంబంధాల అధికారులు గాని పెద్దగా అవినీతికి పాల్పడిన సందర్భాలు లేవని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఒకే ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని అంటున్నారు.

గత క్యాబినెట్ లో ఓ మంత్రి తన వ్యక్తిగత కార్యదర్శి కారణంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని అంటున్నారు. అయితే చిత్రంగా గత క్యాబినెట్ లో వ్యక్తిగత కార్యదర్శి కారణంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రికే ఇప్పుడు క్యాబినెట్ లో కూడా స్థానం కల్పించారని అంటున్నారు. మంత్రి పదవులు ఇచ్చి అధికారం లేకుండా చేసి ఉత్సవ విగ్రహాల్లాగా నిలబెడతారా అని అటు ప్రతిపక్షాలు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు.

First Published:  26 Feb 2019 12:50 AM GMT
Next Story