Telugu Global
NEWS

ఇదీ... విశాఖ క్రికెట్ అభిమానుల సంస్కారం!

పుల్వామా ఉగ్రదాడి మృతుల సంతాపంలో అరుపులు కేకలు కెప్టెన్ కొహ్లీ వారించినా పట్టించుకోని వెర్రి అభిమానులు విశాఖ స్టేడియంలో చోద్యం చూసిన క్రికెట్ సంఘాల పెద్దలు పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి సంతాపం ప్రకటించడం, ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ కొద్ది నిముషాలపాటు శ్రద్ధాంజలి ఘటించడం.. ప్రతి భారత పౌరుడి కర్తవ్యం. అయితే…పెద్దమనుషుల క్రీడ పుణ్యమా అంటూ…ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం కాస్త ఓ ఫార్సులా, సభ్యసమాజం తలదించుకొనేలా తయారయ్యింది. విశాఖపట్నంలోని ఆంధ్ర […]

ఇదీ... విశాఖ క్రికెట్ అభిమానుల సంస్కారం!
X
  • పుల్వామా ఉగ్రదాడి మృతుల సంతాపంలో అరుపులు కేకలు
  • కెప్టెన్ కొహ్లీ వారించినా పట్టించుకోని వెర్రి అభిమానులు
  • విశాఖ స్టేడియంలో చోద్యం చూసిన క్రికెట్ సంఘాల పెద్దలు

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి సంతాపం ప్రకటించడం, ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ కొద్ది నిముషాలపాటు శ్రద్ధాంజలి ఘటించడం.. ప్రతి భారత పౌరుడి కర్తవ్యం.

అయితే…పెద్దమనుషుల క్రీడ పుణ్యమా అంటూ…ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం కాస్త ఓ ఫార్సులా, సభ్యసమాజం తలదించుకొనేలా తయారయ్యింది.

విశాఖపట్నంలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి ముందు… రెండుజట్ల ఆటగాళ్లు రెండు నిముషాలపాటు… అమరజవానులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమంలో ఎంతో అంకితభావంతో పాల్గొన్నారు. అయితే…స్టేడియంలోని 30 వేల మంది అభిమానుల్లో కొందరి ప్రవర్తన మాత్రం ఆక్షేపణీయంగా ఉంది.

రెండుజట్ల క్రికెటర్లతో పాటు.. స్టేడియంలోని మెజారిటీ అభిమానులు మౌనంగా ఉంటే…మరికొందరు అభిమానులు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లు చూసుకోడం, ఈలలు, చప్పట్లు, అరుపులు, కేరింతలతో చెలరేగిపోడం చూసి… టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీనే స్వయంగా ముక్కుమీద వేలు వేసి…మౌనంగా ఉండాలంటూ ప్రాధేయపడాల్సి వచ్చింది.

విశాఖ స్టేడియంలోని కొందరి అభిమానుల తీరు చూస్తుంటే…అమరవీరుల ఆత్మకు శాంతి కలగటం సంగతి ఏమో కానీ…. ఈ ఘనులందరినీ కొద్దిగంటలపాటు… పాకిస్థాన్ సరిహద్దుల్లో గోడకుర్చీ వేయించాలన్న కోపం రాక మానదు.

బీసీసీఐతో పాటు భారత క్రికెటర్లు ఇకనైనా….ఇలాంటి ఫార్సును ప్రోత్సహించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. అమరుల కుటుంబాలకు…. తాము క్రికెట్ ద్వారా ఆర్జించిన కోట్ల రూపాయల ఆదాయంలో…. కొంత మొత్తాన్ని అందచేస్తే… అంతకు మించిన నివాళి మరొకటి ఉండదు. ఈ వాస్తవాన్ని…. ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ఇకనైనా గమనిస్తే మంచిది.

First Published:  25 Feb 2019 8:30 PM GMT
Next Story