Telugu Global
Cinema & Entertainment

బాలక్రిష్ణ నో చెప్పాడు, రవితేజ ఎస్ చెప్పాడు?

స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కి గత కొంత కాలంగా హిట్స్ లేవు. వినాయక్ సక్సెస్ రేస్ లో లేకపోయేసరికి అందరూ వినాయక్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ వినాయక్ కి అదే టైం లో నందమూరి బాలక్రిష్ణతో ఒక ప్రాజెక్ట్ సెట్ అయింది. సి.కళ్యాణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకి వచ్చాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వినాయక్ తో సినిమా చేస్తాను అని మాట ఇచ్చిన బాలక్రిష్ణ, సడన్ గా బోయపాటి […]

బాలక్రిష్ణ నో చెప్పాడు, రవితేజ ఎస్ చెప్పాడు?
X

స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కి గత కొంత కాలంగా హిట్స్ లేవు. వినాయక్ సక్సెస్ రేస్ లో లేకపోయేసరికి అందరూ వినాయక్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ వినాయక్ కి అదే టైం లో నందమూరి బాలక్రిష్ణతో ఒక ప్రాజెక్ట్ సెట్ అయింది. సి.కళ్యాణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకి వచ్చాడు.

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వినాయక్ తో సినిమా చేస్తాను అని మాట ఇచ్చిన బాలక్రిష్ణ, సడన్ గా బోయపాటి శ్రీను ని పిలిచి తన తదుపరి సినిమా ఆఫర్ ని శ్రీనుకి ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు మళ్ళీ వినాయక్ పరిస్థితి మొదటికే వచ్చింది. వినాయక్ కి ఏం చేయాలో తెలియాలి స్థితిలో రవితేజ వినాయక్ కి పిలిచి మరి కథ రెడీ చేసుకొని రమ్మని చెప్పాడట.

ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో “కృష్ణ” అనే సినిమా వచ్చింది. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత వీళ్ళ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది. డి.వి.వి దానయ్య ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం రవితేజ “డిస్కో రాజా” సినిమాతో బిజీగా ఉన్నాడు.

First Published:  26 Feb 2019 12:42 AM GMT
Next Story