Telugu Global
NEWS

బాలయ్య సన్నిహితుడు.... టీడీపీని వీడబోతున్నాడా?

ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే టికెట్ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెద్ద రచ్చనే రాజేస్తూ ఉంది. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూ రావు ఈ సారి తనకే టికెట్ కావాలని అంటున్నాడు. అయితే బాబూరావుకు టికెట్ కేటాయిస్తే పార్టీకి ఓటమి తప్పదని బాబు ఒక అంచనాకు వచ్చాడట. బాబు సర్వేలు ఈ విషయాన్ని తేల్చేసినట్టుగా సమాచారం. దీంతో బాబూరావు స్థానంలో మరొకరికి టికెట్ ఇవ్వాలని బాబు చాన్నాళ్ల నుంచే ప్రణాళికలు వేశాడు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ […]

బాలయ్య సన్నిహితుడు.... టీడీపీని వీడబోతున్నాడా?
X

ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే టికెట్ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెద్ద రచ్చనే రాజేస్తూ ఉంది. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూ రావు ఈ సారి తనకే టికెట్ కావాలని అంటున్నాడు. అయితే బాబూరావుకు టికెట్ కేటాయిస్తే పార్టీకి ఓటమి తప్పదని బాబు ఒక అంచనాకు వచ్చాడట. బాబు సర్వేలు ఈ విషయాన్ని తేల్చేసినట్టుగా సమాచారం. దీంతో బాబూరావు స్థానంలో మరొకరికి టికెట్ ఇవ్వాలని బాబు చాన్నాళ్ల నుంచే ప్రణాళికలు వేశాడు.

అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిని బాబు లైన్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ అనే ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ విషయంలో బాబూరావు తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నాడట. తను ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే అని అంటున్నాడట.

తనకు టికెట్ ఇవ్వాలని.. తను పాతిక వేల ఓట్ల మెజారిటీతో నెగ్గడం ఖాయమని బాబూరావు అంటున్నాడట. అయితే.. చంద్రబాబుకు మాత్రం ఆ నమ్మకం లేదని సమాచారం. అందుకే ఉగ్ర నరసింహారెడ్డి వైపే బాబు మొగ్గు చూపుతున్నాడని సమాచారం.

ఈ పరిస్థితి వస్తే.. తను తెలుగుదేశానికి రాజీనామా చేయడం ఖాయమని బాబూరావు ప్రకటించాడట. ఈ మేరకు బాలయ్యకు కూడా పరిస్థితిని వివరించి.. చంద్రబాబుకు చెప్పించాడట బాబూరావు. ఏదేమైనా బాబూరావుకు తెలుగుదేశం టికెట్ దక్కడం కష్టమే అని.. ఆయన తెలుగుదేశాన్ని వీడవచ్చని ప్రచారం జరుగుతూ ఉంది!

First Published:  27 Feb 2019 5:15 AM GMT
Next Story