Telugu Global
NEWS

ఓవైసీని చూసి నేర్చుకో చంద్రబాబు....

మన దేశంలో ఎన్నో వైరుద్యాలు, రాజకీయంగా భేదాభిప్రాయాలు, కులాలు, మతాలు ఉన్నాయి. కానీ దేశం కోసం ఒక్కటవాల్సిన సమయంలో రాజకీయం పక్కన పడేసి జైకొడుతుంది మన దేశం. పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేసి సైనికులను పొట్టనపెట్టుకున్న సమయంలో దేశం మొత్తం విలవిలలాడింది. ప్రతి ఒక్కరూ ఖండించారు. కానీ సైనికుల నెత్తురుతో కూడా రాజకీయ రంగు పలుముకోవాలని ప్రయత్నించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మోడీకి తెలిసే దాడి జరిగిందని మమతా ప్రేలాపన చేస్తే వెంటనే చంద్రబాబు అందుకుని… ఉగ్రదాడి వెనుక తమ ప్రమేయం లేదు అని పాక్ ప్రధాని కూడా […]

ఓవైసీని చూసి నేర్చుకో చంద్రబాబు....
X

మన దేశంలో ఎన్నో వైరుద్యాలు, రాజకీయంగా భేదాభిప్రాయాలు, కులాలు, మతాలు ఉన్నాయి. కానీ దేశం కోసం ఒక్కటవాల్సిన సమయంలో రాజకీయం పక్కన పడేసి జైకొడుతుంది మన దేశం. పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేసి సైనికులను పొట్టనపెట్టుకున్న సమయంలో దేశం మొత్తం విలవిలలాడింది. ప్రతి ఒక్కరూ ఖండించారు.

కానీ సైనికుల నెత్తురుతో కూడా రాజకీయ రంగు పలుముకోవాలని ప్రయత్నించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మోడీకి తెలిసే దాడి జరిగిందని మమతా ప్రేలాపన చేస్తే వెంటనే చంద్రబాబు అందుకుని… ఉగ్రదాడి వెనుక తమ ప్రమేయం లేదు అని పాక్ ప్రధాని కూడా చెప్పారు కదా అంటూ నంగనాచి మాటలు మాట్లాడారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో బహుశా టీడీపీలోని నాయకులు కూడా లోలోన దిగ్బ్రాంతి చెంది ఉంటారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా మన సైనం ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ క్షణాన దేశం జైయహో అని నినదించింది. చంద్రబాబు, మమతా లాంటి వారు కూడా ట్విట్టర్లో నినదించాల్సి వచ్చింది.

అయితే చంద్రబాబు లాంటి వారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని చూసి నేర్చుకోవాల్సి ఉంది అంటున్నారు. ఓవైసీకి బీజేపీ అంటే అస్సలు పడదన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి ఓవైసీ కూడా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు.

పాక్‌కు చెందిన ఒక ఎంపీ భారత్‌లో గుడి గంటలు మోగకుండా చేస్తామని వ్యాఖ్యానించగా… అసద్ వెంటనే స్పందించారు. భారతదేశంలో ముస్లింలు ఉన్నంత కాలం…. ఇక్కడ ప్రతి గుడిలో గంటలు మోగుతూనే ఉంటాయి… ప్రతి మసీదులో
ఆజాన్‌లు వినిపిస్తూనే ఉంటాయని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. భారత ముస్లింల గురించి పాక్ ఆలోచించనవసరం లేదన్నారు. 1947లో భారత్ ను ఇక్కడి ముస్లింలు సొంత దేశంగా భావించారన్నారు. ఇక్కడి హిందూ, ముస్లింలు సంక్షోభ
సమయంలో ఒకరికొకరు అండగా ఉంటారని చాటారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అమాయకుడిలా నటించడం మానేయాలని హితవు పలికారు.

తాజాగా భారత వైమానిక దాడుల తర్వాత కూడా ఓవైసీ స్పందించిన తీరు ఆకట్టుకుంది. ఏదో మాట వరసకు కొందరు ముఖ్యమంత్రులు ట్విట్టర్లో స్పందించినట్టు కాకుండా… భారత్‌ చేసిన దాడుల పట్ల అసద్ మీడియా ముందుకు వచ్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ దాడులు ఇంకా ముందే చేయాల్సిందని వ్యాఖ్యానించారు. ఆ మాటలు గుండెల్లోంచి వచ్చాయన్న విషయం ఆయన మాట్లాడిన విధానం చూసినా అర్థమవుతుంది. కానీ ఈ తరహాలో చంద్రబాబు, మమతాల స్పందన లేకపోవడం ఈ దేశ రాజకీయ వ్యవస్థ దురదృష్టం అంటున్నారు ప్రజలు.

First Published:  27 Feb 2019 1:25 AM GMT
Next Story