Telugu Global
International

అణ్వస్త్రాయుధ నిర్ణయాత్మక కమిటీతో ఇమ్రాన్ భేటీ

భారత్- పాక్‌ మధ్య యుద్ధం తప్పదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్‌-పాక్ రెండు దేశాలూ వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటున్నాయి. ఇదే భారత్‌-పాక్‌ మధ్య అంతిమ యుద్ధం కావొచ్చని పాక్ రైల్వే మంత్రి ఇదివరకే ప్రకటించారు. యుద్ధమే వస్తే రెండో ప్రపంచ యుద్ధం కంటే భీకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇటు భారత్‌ సైన్యం సెలవులు రద్దు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తోంది. ఇదే సమయంలో ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ భద్రతపై అత్యున్నత సమావేశం నిర్వహించారు. అణ్వాయుధ […]

అణ్వస్త్రాయుధ నిర్ణయాత్మక కమిటీతో ఇమ్రాన్ భేటీ
X

భారత్- పాక్‌ మధ్య యుద్ధం తప్పదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్‌-పాక్ రెండు దేశాలూ వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటున్నాయి. ఇదే భారత్‌-పాక్‌ మధ్య అంతిమ యుద్ధం కావొచ్చని పాక్ రైల్వే మంత్రి ఇదివరకే ప్రకటించారు. యుద్ధమే వస్తే రెండో ప్రపంచ యుద్ధం కంటే భీకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఇటు భారత్‌ సైన్యం సెలవులు రద్దు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తోంది. ఇదే సమయంలో ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ భద్రతపై అత్యున్నత సమావేశం నిర్వహించారు.

అణ్వాయుధ నిర్ణయాత్మక కమిటీతో ఇమ్రాన్ ఖాన్ భేటీ అయ్యారు. దీంతో పరిస్థితి ఎంతవరకు వెళ్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత్‌- పాక్ రెండూ కూడా అణ్వాయుధాలున్న దేశాలే.

First Published:  27 Feb 2019 3:56 AM GMT
Next Story