Telugu Global
NEWS

ఆసీస్ తో ఆఖరి టీ-20లో డూ ఆర్ డై

ఆసీస్ కు చెలగాటం… టీమిండియాకు సిరీస్ సంకటం బెంగళూరు వేదికగా నేడే ఆఖరాట రాత్రి 7 గంటల నుంచి ఆఖరి టీ-20 టీమిండియా-ఆస్ట్రేలియా రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ క్లైమాక్స్ దశకు చేరింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈరోజు జరిగే రెండో మ్యాచ్… ఆతిథ్య టీమిండియాకు డూ ఆర్ డై గా మారింది. 1-1తో సిరీస్ ను సమం చేసి పరువు దక్కించుకోవాలంటే విరాట్ సేన…ఆరునూరైనా ఈ ఆఖరాటలో నెగ్గి తీరాల్సి ఉంది. రాత్రి 7 గంటలకు […]

ఆసీస్ తో ఆఖరి టీ-20లో డూ ఆర్ డై
X
  • ఆసీస్ కు చెలగాటం… టీమిండియాకు సిరీస్ సంకటం
  • బెంగళూరు వేదికగా నేడే ఆఖరాట
  • రాత్రి 7 గంటల నుంచి ఆఖరి టీ-20

టీమిండియా-ఆస్ట్రేలియా రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ క్లైమాక్స్ దశకు చేరింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈరోజు జరిగే రెండో మ్యాచ్… ఆతిథ్య టీమిండియాకు డూ ఆర్ డై గా మారింది.

1-1తో సిరీస్ ను సమం చేసి పరువు దక్కించుకోవాలంటే విరాట్ సేన…ఆరునూరైనా ఈ ఆఖరాటలో నెగ్గి తీరాల్సి ఉంది. రాత్రి 7 గంటలకు ఫ్లడ్ లైట్ సమరంగా జరిగే ఈ పోటీ… హైస్కోరింగ్ తో సాగే అవకాశం ఉంది.

హైస్కోరింగ్ అడ్డా బెంగళూరు…

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా, ఐదోర్యాంకర్ ఆస్ట్రేలియాజట్ల… రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని హాట్ హాట్ ఫైట్ కు…. హైస్కోరింగ్ అడ్డా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ముగిసిన తొలి టీ-20లో …ఆఖరి బంతి విజయం సాధించిన కంగారూటీమ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

మరోవైపు…ఆతిథ్య టీమిండియా మాత్రం…తొలి టీ-20 ఓటమికి కారణాలు సమీక్షించుకొని…ఆఖరాటలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

రెండుమార్పులతో టీమిండియా?

బెంగళూరు మ్యాచ్ నెగ్గాలంటే…తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు అనివార్యమని టీమిండియా టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. తొలి టీ-20కి దూరంగా ఉన్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ లను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.

ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్ రాహుల్ మినహా మిగిలిన టాపార్డర్ ఆటగాళ్లంతా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడమే.. టీమిండియా తొలి టీ-20 ఓటమికి కారణమని కెప్టెన్ కొహ్లీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

భారీస్కోరుకు ఫించ్ తహతహ…

మరోవైపు…తొలి టీ-20లో దారుణంగా విఫలమైన కంగారూ కెప్టెన్ ఆరోన్ ఫించ్….ఈ ఆఖరాటలో భారీస్కోరు సాధించాలన్న కసితో ఉన్నాడు.

భారత పవర్ ఫుల్ బ్యాటింగ్ కు… కంగారూ పదునైన బౌలింగ్ కు మధ్య జరిగే ఈ పోటీ..ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.

అంతేకాదు…బ్యాటింగ్ తో పాటు భారీ చేజింగ్ కు అనువుగా ఉండే…బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫ్లడ్ లైట్ల సమరం…పరుగుల వెల్లువ, సిక్సర్లు, బౌండ్రీల హోరుగా సాగే అవకాశం ఉంది.

భారత గడ్డపై ఆస్ట్రేలియా మూడో టీ-20 విజయం సాధిస్తుందా?…లేక ఆఖరాట నెగ్గడం ద్వారా టీమిండియా 1-1తో సిరీస్ ను సమం చేస్తుందా? తెలుసుకోవాలంటే మాత్రం…రాత్రి 11 గంటల వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  26 Feb 2019 7:02 PM GMT
Next Story