Telugu Global
International

భారత్‌పై దాడులకు దిగొద్దు : పాకిస్తాన్‌కు అమెరికా హెచ్చరిక

పీవోకేలోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలను భారత వాయుసేన దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. తాజాగా అమెరికా పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్ర క్యాంపులను వెంటనే ధ్వంసం చేయాలని.. ఆ శిక్షణా శిబిరాలను నిర్మూలించకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా చెప్పింది. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగొద్దని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించింది. మరో వైపు.. ఇండియా, పాకిస్తాన్ ఈ సమస్యను శాంతియుతంగా […]

భారత్‌పై దాడులకు దిగొద్దు : పాకిస్తాన్‌కు అమెరికా హెచ్చరిక
X

పీవోకేలోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలను భారత వాయుసేన దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. తాజాగా అమెరికా పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్ర క్యాంపులను వెంటనే ధ్వంసం చేయాలని.. ఆ శిక్షణా శిబిరాలను నిర్మూలించకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా చెప్పింది. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగొద్దని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించింది.

మరో వైపు.. ఇండియా, పాకిస్తాన్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది. పాకిస్తాన్ కూడా ఉగ్రవాదంపై తమ తీరును మార్చుకోవాలని కోరింది. ఇరు దేశాల సరిహద్దుల్లో యుద్ద వాతావరణాన్ని తీసుకొని రావద్దని.. ఇది దక్షిణాసియాలో శాంతికి విఘాతం కలిగించవచ్చని అమెరికా చెబుతోంది.

అయితే అమెరికా ఇన్ని సూచనలు చేసినా పాకిస్తాన్ సైన్యం మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతోంది. జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టర్‌లో బాంబు దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఐదుగురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. మరోవైపు సైన్యం జరిపిన దాడిలో ఇద్దరు జైషే తీవ్ర వాదులు హతమయ్యారు.

First Published:  27 Feb 2019 12:12 AM GMT
Next Story