Telugu Global
Cinema & Entertainment

మరోసారి క్లారిటీ ఇచ్చిన మహర్షి

మహేష్ బాబు నటిస్తున్న మహర్షి సినిమాపై మొన్నటివరకు ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఫైనల్ గా వాటన్నింటికీ తెరదించారు మేకర్స్. మహర్షి సినిమా విడుదలపై మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పాటు సినిమా షూటింగ్ విశేషాల్ని కూడా మీడియాతో పంచుకున్నారు. మహర్షి సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని చెబుతున్నారు మేకర్స్. ఈ సినిమా మే లేదా జూన్ నెలకు వాయిదా పడిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేసిన యూనిట్.. ఓవైపు షూటింగ్ చేస్తూనే […]

మరోసారి క్లారిటీ ఇచ్చిన మహర్షి
X

మహేష్ బాబు నటిస్తున్న మహర్షి సినిమాపై మొన్నటివరకు ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఫైనల్ గా వాటన్నింటికీ తెరదించారు మేకర్స్. మహర్షి సినిమా విడుదలపై మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పాటు సినిమా షూటింగ్ విశేషాల్ని కూడా మీడియాతో పంచుకున్నారు.

మహర్షి సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని చెబుతున్నారు మేకర్స్. ఈ సినిమా మే లేదా జూన్ నెలకు వాయిదా పడిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేసిన యూనిట్.. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా కొనసాగిస్తున్నామని తెలిపింది.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది. మహేష్, అల్లరినరేష్ మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మార్చి 15తో ఈ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. దాంతో టాకీ మొత్తం కంప్లీట్ అవుతుంది. 2 పాటలు షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంటుంది. ఆ రెండు పాటల్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి, ఏప్రిల్ 25న థియేటర్లలోకి వచ్చేస్తామంటోంది యూనిట్.

First Published:  27 Feb 2019 6:44 AM GMT
Next Story