Telugu Global
NEWS

మోడీ గ్రాఫ్ పెరుగుదల.... చంద్రబాబుకు కొత్త టెన్షన్!

పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోడీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. భారత సైన్యం పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. ప్రతీకార చర్యలకు భారతీయుల మద్దతు లభిస్తూ ఉంది. జై షే మహ్మద్ కు చెందిన ఉద్రవాద క్యాంపుపై భారత వైమానిక దళం దాడితో ఆ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ చర్యను అందరూ సమర్థిస్తూ ఉన్నారు. ఈ క్రెడిట్ మోడీకి దక్కే పరిస్థితి ఏర్పడింది. […]

మోడీ గ్రాఫ్ పెరుగుదల.... చంద్రబాబుకు కొత్త టెన్షన్!
X

పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోడీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. భారత సైన్యం పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. ప్రతీకార చర్యలకు భారతీయుల మద్దతు లభిస్తూ ఉంది. జై షే మహ్మద్ కు చెందిన ఉద్రవాద క్యాంపుపై భారత వైమానిక దళం దాడితో ఆ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ చర్యను అందరూ సమర్థిస్తూ ఉన్నారు. ఈ క్రెడిట్ మోడీకి దక్కే పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే.. గతంలో భారత్ పై పలు ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు భారత ప్రభుత్వం ధాటిగా స్పందించలేదు. యూపీఏ హయాంలో దేశం నలుమూలలా ఉగ్రవాద దాడులు జరిగాయి. అప్పుడు ప్రతీకార చర్యలు లేవు. ఉగ్రవాదుల పని పట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రతీకార దాడులు చేపట్టింది. దీంతో సహజంగానే మోడీ ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. ఇది మోడీ వ్యతిరేకులకు మింగుడు పడని అంశమే. అలాంటి వ్యతిరేకుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు.

మోడీ మీద వ్యతిరేకతను పెంచి పబ్బం గడుపుకోవాలని అనేది చంద్రబాబు నాయుడి ప్రస్తుత వ్యూహం. అందులో భాగంగా.. గత కొన్నాళ్లు గా మోడీ మీద ప్రతి రోజూ చంద్రబాబు నాయుడు విరుచుకుపడుతూ ఉన్నాడు. మోడీని విలన్ గా చేసి రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు భావించాడు. ఆఖరికి పుల్వామా అటాక్ అనంతరం కూడా పాక్ ను సమర్థిస్తూ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఆ మేరకు లీకులు ఇచ్చాడు. ఆ తీరు విమర్శల పాలైంది.

ఇప్పుడు మోడీ గ్రాఫ్ మరింత పెరుగుతూ ఉంది. మోడీకి భారతీయుల సపోర్ట్ గట్టిగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి ఏపీ ప్రజలు కూడా మినహాయింపు కాకపోవచ్చు. రాష్ట్రం కన్నా దేశం ముఖ్యం అని ప్రజలు ఆలోచిస్తే మోడీని వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు కూడా ఎన్నికల్లో పంచ్ పడే అవకాశాలున్నాయి!

First Published:  27 Feb 2019 6:32 AM GMT
Next Story