Telugu Global
NEWS

ఇండియన్ ఏర్ ఫోర్స్ కు సచిన్, సైనా హ్యాట్సాఫ్

భారత షూటర్లకు సైనికదళాల పిలుపు యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఆదేశాలు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై మెరుపుదాడులు జరిపిన భారత వైమానిక దళానికి మాస్టర్ సచిన్ టెండుల్కర్ తో సహా పలువురు క్రీడా దిగ్గజాలు హ్యాట్సాఫ్ చెప్పారు. సైనికదళాలను చూసి దేశం గర్వపడుతోందని తెలిపారు. భారత్ మంచితనాన్ని పొరుగుదేశం అసమర్థతగా భావిస్తే భారీమూల్యం చెల్లించాల్సి వస్తుందని సచిన్ ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నాడు. భారత వైమానిక దళంలో గౌరవ కెప్టెన్ హోదాలో ఉన్న సచిన్… తన సంఘీభావాన్ని ప్రకటించాడు. భారత […]

ఇండియన్ ఏర్ ఫోర్స్ కు సచిన్, సైనా హ్యాట్సాఫ్
X
  • భారత షూటర్లకు సైనికదళాల పిలుపు
  • యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఆదేశాలు

పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై మెరుపుదాడులు జరిపిన భారత వైమానిక దళానికి మాస్టర్ సచిన్ టెండుల్కర్ తో సహా పలువురు క్రీడా దిగ్గజాలు హ్యాట్సాఫ్ చెప్పారు. సైనికదళాలను చూసి దేశం గర్వపడుతోందని తెలిపారు.

భారత్ మంచితనాన్ని పొరుగుదేశం అసమర్థతగా భావిస్తే భారీమూల్యం చెల్లించాల్సి వస్తుందని సచిన్ ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నాడు. భారత వైమానిక దళంలో గౌరవ కెప్టెన్ హోదాలో ఉన్న సచిన్… తన సంఘీభావాన్ని ప్రకటించాడు.

భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్, కిడాంబీ శ్రీకాంత్, టెన్నిస్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి సైతం ట్విట్టర్ సందేశాల ద్వారా… భారత సైనిక దళాలకు తమ మద్దతు ప్రకటించారు.

మరోవైపు… ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ పోటీలలో పాల్గొంటున్న భారత సైనిక దళాలకు చెందిన రైఫిల్ షూటర్లు రవి కుమార్, దీపక్ కుమార్ లను తక్షణమే వచ్చి విధుల్లో చేరాలని…. ఆర్మీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

భారత సైనిక దళాలలో పని చేస్తున్నందకు తమకు గర్వకారణంగా ఉందని…సైనిక విధులు నిర్వరించడానికి సిద్ధంగా ఉన్నామని… క్రీడల కంటే దేశసేవే తమకు ప్రధానమని ప్రకటించారు.

First Published:  27 Feb 2019 10:50 AM GMT
Next Story