Telugu Global
Cinema & Entertainment

"డియర్ కామ్రేడ్" రిలీజ్ డేట్ ఇదేనా?

గత ఏడాది “గీత గోవిందం” “టాక్సీ వాలా” సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని తన మార్కెట్ రేంజ్ ని పెంచుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా “డియర్ కామ్రేడ్”. ఈ సినిమా ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ అయిన భరత్ కమ్మ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. మొన్నటి వరకు కాకినాడ లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా […]

డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ ఇదేనా?
X

గత ఏడాది “గీత గోవిందం” “టాక్సీ వాలా” సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని తన మార్కెట్ రేంజ్ ని పెంచుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా “డియర్ కామ్రేడ్”. ఈ సినిమా ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ అయిన భరత్ కమ్మ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. మొన్నటి వరకు కాకినాడ లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేసి…. ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక క్రికెట్ ప్లేయర్ గా కనిపించనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ని సమ్మర్ లో మే 22 న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మూవీ యూనిట్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  28 Feb 2019 12:34 AM GMT
Next Story