Telugu Global
Cinema & Entertainment

అల్లు శిరీష్ సెట్ కాడట....  సాయి ధరమ్ తేజ్ అయితే ఓకే...!

బూతు కామెడీ సినిమాలతో డైరెక్ట్ గా పరిచయం అయి…. ఆ తరువాత ఫ్యామిలీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న డైరెక్టర్ మారుతీ. మారుతీ సినిమా అంటే చాలు అందులో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్ కూడా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి టైం లో ఈ దర్శకుడు హీరో సాయి ధరం తేజ్ తో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. కానీ ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు మాత్రం హీరోగా అల్లు శిరీష్ ని పెట్టాలని […]

అల్లు శిరీష్ సెట్ కాడట....  సాయి ధరమ్ తేజ్ అయితే ఓకే...!
X

బూతు కామెడీ సినిమాలతో డైరెక్ట్ గా పరిచయం అయి…. ఆ తరువాత ఫ్యామిలీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న డైరెక్టర్ మారుతీ. మారుతీ సినిమా అంటే చాలు అందులో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్ కూడా ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

ఇలాంటి టైం లో ఈ దర్శకుడు హీరో సాయి ధరం తేజ్ తో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. కానీ ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు మాత్రం హీరోగా అల్లు శిరీష్ ని పెట్టాలని నిర్మాత అల్లు అరవింద్ కోరాడట. కానీ ఈ కథకి శిరీష్ కంటే కూడా సాయి ధరం తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అల్లు అరవింద్ ని కన్విన్స్ చేసి సినిమా ఓకే చేయించుకున్నాడట మారుతీ.

ఆ విధంగా శిరీష్ నటించాల్సిన సినిమాలో…. సాయి ధరం తేజ్ నటించడానికి రెడీ అయిపోయాడు. గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

First Published:  28 Feb 2019 5:58 AM GMT
Next Story