Telugu Global
NEWS

సిరీస్ ఆస్ట్రేలియార్పణం

భారత్ కెప్టెన్ విరాట్ కొహ్లీ వీర విహారం. యువ సంచలనం కె.ఎల్.రాహుల్ దుమ్మురేపడం… సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ థీనీ బాధ్యతాయుత బ్యాటింగ్. ఇవన్నీ కలిసినా…. భారత్ ను విజయ తీరాలకు చేర్చలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ – 20 రెండో మ్యాచ్ లో కూడా భారత్ ఓటమి పాలైంది. భారత్ భారీ స్కోర్ చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. విశాఖపట్నంలో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో విజయం సాధించి ఆధిక్యతను ప్రదర్శించిన ఆస్ట్రేలియా  బెంగళూరులో జరిగిన రెండో […]

సిరీస్ ఆస్ట్రేలియార్పణం
X

భారత్ కెప్టెన్ విరాట్ కొహ్లీ వీర విహారం. యువ సంచలనం కె.ఎల్.రాహుల్ దుమ్మురేపడం… సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ థీనీ బాధ్యతాయుత బ్యాటింగ్. ఇవన్నీ కలిసినా…. భారత్ ను విజయ తీరాలకు చేర్చలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ – 20 రెండో మ్యాచ్ లో కూడా భారత్ ఓటమి పాలైంది.

భారత్ భారీ స్కోర్ చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. విశాఖపట్నంలో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో విజయం సాధించి ఆధిక్యతను ప్రదర్శించిన ఆస్ట్రేలియా బెంగళూరులో జరిగిన రెండో టీ – 20లోనూ అనూహ్య విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను భారత బ్యాట్స్ మెన్ ఆడుకున్నారు. యువ ఓపెనర్ కె.ఎల్.రాహుల్ చేలరేగి ఆడాడు. మరో ఓపెనర్ శిఖర్ థావన్ 14 పరుగుల తక్కువ స్కోరుకే అవుటైనా ఉన్న కాసింత సేపు మెరుపులు మెరిపించాడు.

థావన్ అవుటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ చెలరేగిపోయాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే రాహుల్ కూడా అర్ధ సెంచరీ ముందు అవుట్ కావడంతో అతని స్ధానంలో రిషబ్ పంత్ వచ్చాడు. ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడని రిషబ్ పంత్ భారీ షాట్ కు యత్నించి రిచర్డ్‌సన్ బౌలింగ్ లో డార్సీ షార్ట్ క్యాచ్ పట్టడంతో వెనుతిరిగాడు.

అతని స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన మహేంద్ర సింగ్ థోనీ కెప్టెన్ కొహ్లీకి జత కలిసాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లను తుత్తనీయులు చేశారు. ఆ దశలో కొహ్లీ తన ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మంచి ఊపు మీదున్న థోనీ 40 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్పెషలిస్టు బ్యాట్‌మెన్ దినేష్ కార్తీక్ వస్తూనే రెండు ఫోర్లు కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే దెబ్బ తగిలింది. కొత్త బౌలర్ సిద్దార్ధ కౌల్ తన తొలి ఓవర్ రెండో బంతికే స్టొయినిస్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంత సేపటికి విధ్వంసరక బ్యాట్ మెన్ ఫించ్ ను విజయ శంకర్ అవుట్ చేశాడు. భారీ షాట్ కు యత్నించిన ఫింఛ్ మిడాన్ లో థామన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 22 పరుగులు మాత్రమే. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా ఆడాడు. 113 పరుగులతో నాటౌట్ గా నిలిచిన మ్యాక్స్‌వెల్ కు ఓపెనర్ డార్సీ షార్ట్ (40) మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. అతను అవుట్ అయిన తర్వాత హ్యాండ్స్‌కోంబ్ బరిలో దిగి బాధ్యతాయుత బ్యాటింగ్ తో మ్యాచ్ ను గెలిపించారు.

ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించి 194 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో టీ – 20 సిరిస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

First Published:  27 Feb 2019 9:10 PM GMT
Next Story