Telugu Global
Cinema & Entertainment

గోవా బయల్దేరిన ఇస్మార్ట్ శంకర్

రామ్, పూరి జగన్నాధ్ ఫ్రెష్ కాంబోలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుతుంది. సినిమా లాంచింగ్ రోజునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్, ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ను వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని నిర్మాత ఛార్మి వెల్లడించింది. “ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో 30 రోజుల భారీ షెడ్యూల్ పూర్తిచేశాం. తర్వాత షెడ్యూల్ కోసం మేమంతా గోవా వెళ్తున్నాం. అది […]

గోవా బయల్దేరిన ఇస్మార్ట్ శంకర్
X

రామ్, పూరి జగన్నాధ్ ఫ్రెష్ కాంబోలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుతుంది. సినిమా లాంచింగ్ రోజునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్, ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ను వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని నిర్మాత ఛార్మి వెల్లడించింది.

“ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో 30 రోజుల భారీ షెడ్యూల్ పూర్తిచేశాం. తర్వాత షెడ్యూల్ కోసం మేమంతా గోవా వెళ్తున్నాం. అది కూడా భారీ షెడ్యూల్. గోవా తర్వాత కాశి వెళ్తాం. అక్కడ సాంగ్ షూట్ చేస్తాం. సినిమా బాగా వస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాను మే నెలలో విడుదల చేస్తాం. అతి త్వరలో డేట్ కూడా ప్రకటిస్తాం.”

ఇలా సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టింది చార్మి. చాలా ఫాస్ట్ గా సినిమా పూర్తి చేస్తున్నామని, మే నెలలో థియేటర్లలోకి వస్తామని తెలిపింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే ఆఖరి వారంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హీరో రామ్ కు టోటల్ గా ఇది కొత్త టీం.

First Published:  28 Feb 2019 8:00 AM GMT
Next Story