Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ దర్శకుడితో కళ్యాణ్ రామ్

గత కొంత కాలంగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక్క హిట్టు కూడా లేదు. ‘నా నువ్వే’ వంటి డిజాస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్ర పోషించారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘118’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు కళ్యాణ్ రామ్. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా రేపే విడుదల కానుంది. ఇక తాజా సమాచారం […]

ఫ్లాప్ దర్శకుడితో కళ్యాణ్ రామ్
X

గత కొంత కాలంగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక్క హిట్టు కూడా లేదు. ‘నా నువ్వే’ వంటి డిజాస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్ర పోషించారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ‘118’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు కళ్యాణ్ రామ్. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా రేపే విడుదల కానుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ దర్శకుడు శ్రీవాస్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. బాలకృష్ణతో ‘డిక్టేటర్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘సాక్ష్యం’ సినిమాలను తెరకెక్కించిన శ్రీనివాస్ ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ అవ్వగానే అధికారిక ప్రకటన వెలువడనుంది. రైటర్ లక్ష్మీభూపాల్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. కానీ శ్రీవాస్ సినిమాలన్నీ కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటాయి.

‘లౌక్యం’ లాంటి హిట్ సినిమాలను తీసినప్పటికీ శ్రీవాస్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. మరి అసలే కళ్యాణ్ రామ్ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఇలాంటి సమయంలో కళ్యాణ్ రామ్…. శ్రీవాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడటే అది రిస్క్ అనే చెప్పాలి.

First Published:  28 Feb 2019 2:27 AM GMT
Next Story