Telugu Global
NEWS

చంద్రబాబు అందుకే యూపీఏలో చేరలేదు....

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావులు వైసీపీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో వైఎస్ జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృపారాణి…. చంద్రబాబు అనుభవాన్ని చూసే గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఓటేశారన్నారు. కానీ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. మట్టి నుంచి మద్యం వరకు ప్రతి అంశంలోనూ దోపిడి జరుగుతోందన్నారు. 90 వేల కోట్ల అప్పుతో చంద్రబాబు చేతికి వచ్చిన రాష్ట్రం…. ఇప్పుడు రెండు […]

చంద్రబాబు అందుకే యూపీఏలో చేరలేదు....
X

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావులు వైసీపీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో వైఎస్ జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృపారాణి…. చంద్రబాబు అనుభవాన్ని చూసే గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఓటేశారన్నారు. కానీ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు.

ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. మట్టి నుంచి మద్యం వరకు ప్రతి అంశంలోనూ దోపిడి జరుగుతోందన్నారు. 90 వేల కోట్ల అప్పుతో చంద్రబాబు చేతికి వచ్చిన రాష్ట్రం…. ఇప్పుడు రెండు లక్షల 50వేల కోట్లకు
చేరిందన్నారు. 2014లో జగన్‌…. వైఎస్‌ కుమారుడిగానే పరిచయం అయ్యారని…. కానీ ఇప్పుడు జగన్‌ రాటు దేలిన రాజకీయ నాయకుడిగా సొంతంగా నిలబడ్డారన్నారు.

కేంద్రంలో అన్ని పార్టీలు యూపీఏలో చేరాలని ప్రచారం చేస్తున్న చంద్రబాబు… ఏపీలో మాత్రం తానెందుకు యూపీఏలో చేరలేదని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల తర్వాత పొరపొటుగా తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అటువైపు దూకవచ్చు అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు యూపీఏలో చేరుకుండా గోడ మీద కూర్చుని నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదాను ఓటుకు నోటు కేసుకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. సంతలో పశువుల్లాగా వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

First Published:  28 Feb 2019 1:57 AM GMT
Next Story