Telugu Global
International

పాకిస్థాన్‌కు భారత్‌ అల్టిమేటం....

పాకిస్థాన్‌కు భారత్‌ అల్టిమేటం ఇచ్చింది. పైలట్ అభినందన్ బంధీగా చిక్కిన నేపథ్యంలో భారత్ కాస్త వెనుకడుగు వేస్తుందని పాక్‌ భావించింది. అయితే భారత్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అభినందన్‌ను బేషరత్తుగా పాకిస్థాన్‌ విడుదల చేయాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. అభినందన్ విషయంలో ఎలాంటి చర్చలు, ఒప్పందాలు చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది భారత్. గతంలో కాందహార్ విమాన హైజాక్ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకోవడాలేమీ ఉండవని భారత్ స్పష్టంగా చెప్పేసింది. భారత్‌ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా […]

పాకిస్థాన్‌కు భారత్‌ అల్టిమేటం....
X

పాకిస్థాన్‌కు భారత్‌ అల్టిమేటం ఇచ్చింది. పైలట్ అభినందన్ బంధీగా చిక్కిన నేపథ్యంలో భారత్ కాస్త వెనుకడుగు వేస్తుందని పాక్‌ భావించింది. అయితే భారత్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అభినందన్‌ను బేషరత్తుగా పాకిస్థాన్‌ విడుదల చేయాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది.

అభినందన్ విషయంలో ఎలాంటి చర్చలు, ఒప్పందాలు చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది భారత్. గతంలో కాందహార్ విమాన హైజాక్ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకోవడాలేమీ ఉండవని భారత్ స్పష్టంగా చెప్పేసింది.

భారత్‌ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని…. కానీ పాకిస్థాన్‌ మాత్రం భారత్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాక్‌ గడ్డపై ఉన్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనంది. అటు పాక్‌ విదేశాంగ మంత్రి షా ఖురేషి మాత్రం అభినందన్‌ విషయంలో కాస్త మెతక వైఖరితోనే మాట్లాడారు.

భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గితే అభినందన్‌ను విడిచిపెడతామని చెప్పారు. పుల్వామా ఘటనపై భారత్ ఇచ్చిన ఆధారాలను పరిశీలిస్తామన్నారు. ఖచ్చితమైన ఆధారాలుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

First Published:  28 Feb 2019 5:12 AM GMT
Next Story