Telugu Global
Cinema & Entertainment

"మన్మధుడు 2" లో సమంతా?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో క్లాసిక్ సినిమాగా నిలిచిన “మన్మధుడు” సినిమా సీక్వెల్ కి రెడీ అవుతున్నాడు. “చి.లా. సౌ” ఫేం రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సీక్వెల్ పై నాగార్జున పూర్తి నమ్మకంగా ఉన్నాడు. మార్చి 12 న గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారు మూవీ యూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక […]

మన్మధుడు 2 లో సమంతా?
X

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో క్లాసిక్ సినిమాగా నిలిచిన “మన్మధుడు” సినిమా సీక్వెల్ కి రెడీ అవుతున్నాడు. “చి.లా. సౌ” ఫేం రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సీక్వెల్ పై నాగార్జున పూర్తి నమ్మకంగా ఉన్నాడు.

మార్చి 12 న గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారు మూవీ యూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో అక్కినేని సమంతా కూడా నటించే అవకాశం ఉందట. అవును ఈ సినిమాలో కథని మలుపు తిప్పే పాత్రని సమంతా తో చేయించనున్నాడట రాహుల్ రవీంద్రన్. సమంత, రాహుల్ ఎప్పటినుంచో మంచి స్నేహితులు. సమంతా కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

ఇకపోతే సమంతా, నాగార్జున కలిసి ఇది వరకే “మనం” “రాజు గారి గది 2” వంటి సినిమాల్లో నటించారు. ఇక ఈ “మన్మధుడు 2” సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ మొత్తం యూరోప్ లో జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జునే ఈ సినిమాని స్వయంగా ప్రొడ్యూస్ చేయనున్నాడు. మరి “మన్మధుడు” మ్యాజిక్ “మన్మధుడు 2” కి రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

First Published:  28 Feb 2019 12:43 AM GMT
Next Story