శ్రీధరణినే కాదు 14 మందిపై అత్యాచారం చేశా….

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని జీలకర్రగూడెం బౌద్ద ఆరామాల వద్ద ప్రేమ జంటపై దాడి కేసును పోలీసులు చేధించారు. హంతకుడు రాజుగా గుర్తించారు. విచారణలో అతడు గతంలో చేసిన అనేక అరాచకాలు కూడా వెలుగు
చూశాయి.

దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్లిన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా రాజును పోలీసులు గుర్తించారు. వెయ్యి నెంబర్లను పరిశీలించిన పోలీసులు అందులో ఆరు నెంబర్లను అనుమానాస్పదంగా భావించారు. వాటిని లోతుగా ఆరా తీయగా రాజు విషయం బయటకు వచ్చింది. అతడి గతాన్ని బేరీజు వేసుకుని అదుపులోకి తీసుకుని విచారించారు.

పోలీసుల విచారణలో రాజు చేసిన అనేక దుర్మార్గాలు బయటకు వచ్చాయి. కృష్ణాజిల్లాలో ఇతడు ఇప్పటి వరకు 14 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. అందులో నలుగురు మహిళలపై అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసినట్టు ఒప్పుకున్నాడు. వారంలో ఒకరోజు వేటకు అంటూ రాజు బయటకు వెళ్లేవాడు.

రాజు

ఆ సమయంలో ఎక్కడైనా ప్రేమ జంటలు ఏకాంతంగా ఉంటే దాడి చేసేవాడు. ఆడవారిపై అత్యాచారం చేసి ఆపై నగదు, నగలు దోచుకునే వాడు. సినిమాల ప్రేరణతోనే తాను ఇలా చేసినట్టు రాజు ఒప్పుకున్నాడు. నూజివీడు, మైలవరం, మచిలీపట్నం
ప్రాంతాల్లో ఈ దారుణాలకు ఒడిగట్టాడు. శ్రీధరణిని కూడా తాను దాడి చేసి చంపేసినట్టు అంగీకరించాడు.