Telugu Global
NEWS

అభ్యర్ధుల అరుపులకు తలపట్టుకుంటున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తెలుగు తమ్ముళ్లు మరొకటి తలుస్తున్నారు. ఎన్నికలకు రెండు, మూడు నెలలు ఉన్న సందర్భంలో ముందుగా అభ్యర్దులను ప్రకటించి అటు ప్రచారంలోను, ఇటు ప్రతిపక్షాలలోను ఆందోళన రేకేత్తించాలనుకున్న చంద్రబాబుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసనలతో చుక్కలు చూపిస్తున్నారు. గడచిన పదిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో అభ్యర్దుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కర్నూలు, క్రిష్ణా, ప్రకాశం, పశ్చిమ […]

అభ్యర్ధుల అరుపులకు తలపట్టుకుంటున్న చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తెలుగు తమ్ముళ్లు మరొకటి తలుస్తున్నారు. ఎన్నికలకు రెండు, మూడు నెలలు ఉన్న సందర్భంలో ముందుగా అభ్యర్దులను ప్రకటించి అటు ప్రచారంలోను, ఇటు ప్రతిపక్షాలలోను ఆందోళన రేకేత్తించాలనుకున్న చంద్రబాబుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసనలతో చుక్కలు చూపిస్తున్నారు.

గడచిన పదిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో అభ్యర్దుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కర్నూలు, క్రిష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చలు జరిపారు. అభ్యర్దుల ఎంపిక సజావుగా జరుగుతోందంటూ పచ్చ మీడియాలో కథనాలు గుప్పిస్తున్నారు.

అయితే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయంటున్నారు. ప్రతీ జిల్లా సమావేశంలోను అభ్యర్దుల ఎంపికపై తెలుగుదేశం సీనియర్ నాయకులు, సిట్టింగుల మధ్య పెద్దఎత్తున వాగ్వాదాలు అవుతున్నాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన సమీక్షా సమావేశాలైతే నాయకులు బాహాబాహీకి దిగేంతవరకూ వెళ్లయంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే అందరి సమక్షంలోను అధినేత చంద్రబాబును బూతూలు తిడుతూ వెళ్లిపోయారని సమాచారం.

తెలుగుదేశం పార్టీ అభ్యర్దులను ముందుగా ప్రకటించి ప్రచారంలో ముందుకు దూసుకుపోవాలనుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎమ్మె‌ల్యేలలో అవినీతి, బంధుప్రీతి ఎక్కువైంది అంటూ ప్రజలు తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దీంతో గత కొంత కాలంగా సిట్టింగ్ శాసనసభ్యులలో చాలమందిని మారుస్తామంటూ చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. జిల్లాలలో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు ఇది నిజమేనని భావించారు. అయితే సమీక్షల పేరుతో నిర్వహించిన సమావేశాలలో సిట్టింగ్ శాసనసభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో తెలుగుదేశం నాయకులు అసంతృప్తికి లోనై చంద్రబాబును నేరుగానే విమర్శిస్తున్నారు.

ఈ పరిణామాలతో ఏదో చేద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడుకు, మరింకేదో జరుగుతుండడంతో చంద్రబాబు గందరగోళంలో పడ్డారని అంటున్నారు. ఈ బూమ్‌రాంగ్ గురించి ముందుగా గుర్తించక పొరపాటు చేశామంటూ పార్టీ సీనియర్ నాయకుల వద్ద చంద్రబాబు వాపోతున్నారు.

First Published:  27 Feb 2019 7:02 PM GMT
Next Story