జగన్ ఢిల్లీ టూర్…. బాబులో మరో అలజడి!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలవర పెడుతూ ఉన్నట్టున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. జగన్ ఎక్కడకు వెళ్లినా చంద్రబాబు నాయుడు తీవ్రంగానే కలవర పడుతూ ఉన్నాడు.

ఈ మధ్యనే జగన్ కూతురును చూడటానికి లండన్ వెళితే బాబు సహించలేకపోయాడు. అక్కడ జగన్ కూతురు చదువుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బాబు మాత్రం సహనం కోల్పోయాడు. జగన్ లండన్ పర్యటన విషయంలో బాబు తనదైన శైలిలో బురద జల్లేందుకు ప్రయత్నాలు చేశాడు. అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదు.

అదలా ఉంటే ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు మరింత కలవర పడే సందర్భం లాగుంది. ఇండియాటుడే సదస్సులో పాల్గొనేందుకు జగన్ ఢిల్లీ పయనం అవుతూ ఉన్నారు. జగన్ అక్కడ కు ఎందుకు వెళ్తున్నాడనేది స్పష్టంగానే ఉంది. ఇండియాటుడే సదస్సు లో పాల్గొనడానికి మాత్రమే జగన్ అక్కడకు వెళ్తున్నాడు. అయితే చంద్రబాబు మాత్రం జగన్ ఢిల్లీలో ఎవరినైనా కలుస్తాడా? అనే విషయం పై ఆరా తీయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

జగన్ ఢిల్లీ వెళ్ళడాన్ని సహజంగానే చంద్రబాబు నాయుడు సహించలేడు. వాస్తవానికి జగన్ విషయంలో చంద్రబాబు నాయుడు దేన్నీ సహించే పరిస్థితుల్లో లేడు. జగన్ కొత్తింటిలోకి చేరిన తర్వాత ఢిల్లీ పర్యటన కోసమని.. హైదరాబాద్ చేరుకోవడాన్ని కూడా బాబు తప్పు పట్టాడు. జగన్ ఒక్క రోజు మాత్రమే కొత్తింటిలో ఉన్నాడని బాబు వాపోయారట.

జగన్ ఇంట్లోంచి బయటకు వచ్చినా, బయట నుంచి జగన్ ఇంట్లోకి వెళ్లినా కూడా బాబు సహించే పరిస్థితుల్లో కనిపించడం లేదు! అదీ జగన్ విషయంలో చంద్రబాబుకు ఉన్న భయం రేంజ్!